365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 21,2023:భారత స్టాక్ మార్కెట్లు రెండు రోజుల నష్టాల నుంచి కోలుకున్నాయి. మంగళవారం లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల నుంచి సూచీలకు మద్దతు లభించింది.
నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ జీవిత కాల గరిష్ఠాలను తాకాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 276, ఎన్ఎస్ఈ నిఫ్టీ 89 పాయింట్ల మేర పెరిగాయి. అమెరికా, ఐరోపా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఆసియా సూచీలు మిశ్రమంగా కదలాడాయి.
ప్రస్తుత సపోర్టు, రెసిస్టెన్సీ స్థాయులను బ్రేక్ చేసేంత వరకు మార్కెట్లో ఎలాంటి మూమెంటమ్ ఉండకపోవచ్చు. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గా 83.35 వద్ద స్థిరపడింది.
క్రితం సెషన్లో 65,655 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 65,860 వద్ద మొదలైంది. 65,849 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆపై పుంజుకొని 66,082 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.
చివరికి 275 పాయింట్ల లాభంతో 65,930 వద్ద ముగిసింది. మంగళవారం 19,770 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,754 వద్ద కనిష్ఠాన్ని చేరుకుంది. 19,829 వద్ద గరిష్ఠ స్థాయికి ఎగిసిన సూచీ మొత్తంగా 89 పాయింట్లు పెరిగి 19,783 వద్ద క్లోజైంది.
నిఫ్టీ బ్యాంకు 104 పాయింట్లు ఎగిసి 43,689 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభపడగా 20 కంపెనీలు నష్టపోయాయి. ఎస్బీఐ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ టాప్ గెయినర్స్. బీపీసీఎల్, టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఎన్టీపీసీ, ఎల్‌టీ టాప్ లాసర్స్.
నేడు ఎఫ్ఎంసీజీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకు రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఫైనాన్స్, మీడియా, మెటల్, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు కళకళలాడాయి.
నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్స్ టెక్నికల్ ఛార్ట్ గమనిస్తే 19,900 వద్ద రెసిస్టెన్సీ, 19,780 వద్ద సపోర్టు ఉన్నాయి. ట్రేడర్లు వోల్టాస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అశోక్ లేలాండ్, దివిస్ ల్యాబ్ షేర్లలో పెట్టుబడి పెట్టొచ్చు.
నేడు నిఫ్టీ పెరగడంలో రిలయన్స్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎయిర్‌టెల్, టైటాన్ కీలక పాత్ర పోషించాయి.
ఎక్సిడ్ ఇండస్ట్రీస్ తమ యూనిట్ ఎక్సిడ్ ఎనర్జీ సొల్యూషన్స్‌లో రూ.100 కోట్ల మేర పెట్టుబడి పెట్టనుంది. టీవీఎస్ మోటార్స్ ఆఫ్రికాలో టీవీఎస్ నియో ఏఎంఐను ప్రవేశపెట్టింది. ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో 10 లక్షల షేర్లు చేతులు మారాయి.
టైటాన్ మార్కెట్ విలువ తొలిసారి రూ.3 లక్షలకోట్లకు చేరుకుంది. అల్కెమ్ లెబోరేటరీస్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో, డీఎల్ఎఫ్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, గోద్రేజ్ ప్రాపర్టీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మాక్స్ ఫైనాన్స్, ఒబెరాయ్ రియాల్టీ, పీబీ ఫిన్‌టెక్, పవర్ ఫైనాన్స్ కార్పొ్, ట్రెంట్, టైటాన్ షేర్లు ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి.
డేటామాటిక్స్ గ్లోబల్ ఓ అమెరికా కంపెనీతో 36 మిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిసింది. కేపీఐటీలో ప్రాఫిట్ బుకింగ్ కొనసాగుతోంది. రతన్ ఇండియా, పీసీబీఎల్, కేఈఐ ఇండస్ట్రీస్ షేర్లు జీవిత కాల గరిష్ఠాలను తాకాయి.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709