365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,15 జనవరి, 2025: భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ జ్యువెలరీ బ్రాండ్ రిలయన్స్ జ్యువెల్స్, వినియోగదారుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకమైన డ్రీమ్ డైమండ్ సేల్ ను మరొకసారి ప్రారంభించింది. ఈ సేల్ ఫిబ్రవరి 16, 2025 వరకు కొనసాగుతుంది.
వజ్రాల విలువపై,తయారీ ఛార్జీలపై 30% వరకు ప్రత్యేక తగ్గింపు అందించడంతో పాటు, వజ్రాభరణాలను మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వినియోగదారులకు సువర్ణావకాశాన్ని కల్పిస్తుంది.

విస్తృతమైన వజ్రాభరణాల కలెక్షన్
ఈ సారి డ్రీమ్ డైమండ్ సేల్ లో వినియోగదారుల కోసం వివిధ రకాల బ్రైడల్ సెట్లు, సొగసైన ఉంగరాలు, చెవిపోగులు, గాజులు, గ్రాండ్ నెక్లెస్లు తదితర విభిన్న డిజైన్లతో కూడిన అద్భుతమైన వజ్రాభరణాల కలెక్షన్ అందుబాటులో ఉంది.
ప్రతిరోజూ ధరించే స్టైల్ కోసం కానీ, ప్రత్యేక వేడుకల కోసం కానీ ఇక్కడి వజ్రాభరణాలు అన్ని సందర్భాలకు అందుబాటులో ఉంటాయి.
డ్రీమ్ డైమండ్ సేల్ గురించి సీఈఓ వ్యాఖ్యలు
ఈ సందర్భంగా రిలయన్స్ జ్యువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ మాట్లాడుతూ,
“వజ్రాలు గలిగిన ప్రత్యేకతను, అవి చూపించే భావోద్వేగాలను మేము బాగా అర్థం చేసుకున్నాం.
ప్రతి ఒక్కరికీ ఈ విలువైన ఆభరణాలు అందుబాటులో ఉండేలా ఈ సేల్ను తీసుకువచ్చాం. మా డైమండ్ కలెక్షన్ వినియోగదారుల ప్రతిష్టాత్మక క్షణాలను మరింత ప్రత్యేకంగా మారుస్తుంది.

వజ్రాలపై ప్రత్యేక బంధం
ఈ డ్రీమ్ డైమండ్ సేల్ క్యాంపెయిన్, మహిళలు,వజ్రాల మధ్య గల ఆత్మీయ అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. వజ్రాలను ప్రేమ, ప్రశంసల చిహ్నంగా భావించడాన్ని నొక్కి చెబుతుంది.
క్యాంపెయిన్ లింక్:
https://www.youtube.com/watch?v=ZgJUMSLwhuE
ప్రతి క్షణాన్ని మరపురానిదిగా మార్చే వజ్రాలు
ఈ ప్రత్యేక సేల్ వినియోగదారులకు బహుమతులు ఇవ్వడానికి లేదా ప్రత్యేకమైన క్షణాలను స్మరించుకునే అవకాశాన్ని అందిస్తుంది. 180+ స్వతంత్ర రిలయన్స్ జ్యువెల్స్ షోరూమ్‌లలో ఈ వజ్రాల కలెక్షన్ అందుబాటులో ఉంది.