365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబయి, మార్చి 24, 2025: ఉగాది, గుడిపడ్వా వంటి పండుగలు కొత్త శుభారంభాలకు, సంప్రదాయాలను స్మరించుకోవడానికి చిహ్నాలు. ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు రిలయన్స్ జ్యువెల్స్ వినూత్న ఆఫర్లను ప్రకటించింది.
మార్చి 31 వరకు వినియోగదారులు బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 50% వరకు డిస్కౌంట్, వజ్రాభరణాల తయారీ ఛార్జీలు, విలువపై 35% వరకు తగ్గింపు పొందవచ్చు.
Read this also…Reliance Jewels Unveils Exclusive Festive Offers for Ugadi & Gudi Padwa
Read this also…Narayana Educational Institutions Expands Reach with 52 New Campuses Across India
ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రిలయన్స్ జ్యువెల్స్ ప్రత్యేక కలెక్షన్ ఈ ఉత్సవాల వైభవాన్ని ప్రతిబింబిస్తోంది. మహారాష్ట్రలో గుడిపడ్వా సందర్భంగా నాథ్ ముక్కుపుడక, చంద్రకోర్ బిందీ, తుషి నెక్లెస్, కొల్హాపురి సాజ్, బాజుబంధ్, మంగళసూత్రాలు విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి.

అటు ఉగాది సందర్భంగా ఆలయ శిల్పకళ స్ఫూర్తిగా రూపొందించిన గుట్టపుసలు నెక్లెస్‌లు, లక్ష్మీ నాణెం హరాలు, కాసు మాలలు, ఝుమ్కాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇది కూడా చదవండి…సెల్ఫ్ డ్రైవింగ్ సహా అధునాతన ఫీచర్లు.. త్వరలో టాటా ఎలక్ట్రిక్ కారు..
రిలయన్స్ జ్యువెల్స్ స్టోర్స్‌లో లేదా ఆన్‌లైన్‌లో ఈ ప్రత్యేక కలెక్షన్‌ను అన్వేషించి ఆకర్షణీయమైన ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ప్రతినిధులు సూచిస్తున్నారు.