Fri. Oct 18th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబయి,17 అక్టోబర్,2024: భారతదేశపు అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్స్‌లో ఒకటైన రిలయన్స్ జువెల్స్ రాబోయే పండగ సీజన్ కోసం ప్రత్యేక వివాహ కలెక్షన్స్ ‘వివాహం’ ఆవిష్కరించింది. ఆధునికత, సంప్రదాయం కలబోతగా రూపొందించిన ఈ ప్రత్యేక శ్రేణి వినూత్న వివాహ ఆభరణాలు బ్రాండ్ నిబద్ధతకు తార్కాణంగా నిలుస్తాయి. అందంగా తీర్చిదిద్దిన చోకర్లు, గాజులు, చెవి రింగులు, నెక్లెసులు, హాత్ ఫూల్, మాంగ్ టికా, ముక్కుపుడకలు, వడ్డాణాల వంటివి ఈ సరికొత్త ఆవిష్కరణలో ఉన్నాయి.


బంగారం, డైమండ్స్తో ఎంతో సునిశితంగా తీర్చిదిద్దిన ఈ వివాహం కలెక్షన్‌లో ఎనిమిది అద్భుతమైన ఆభరణాలు ఉన్నాయి. ఇవి ఆధునిక వధువు ఆడంబరాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. అంతే కాదు వివిధ ప్రాంతాల సాంప్రదాయాలను ప్రతిబింబించే అనేక ప్రాంతీయ ఆభరణాలు కూడా ఈ కలెక్షన్‌లో ఉన్నాయి. సంప్రదాయం, సమకాలీన అభిరుచి కలగలిపి ఎంతో ఆలోచనతో రూపొందించిన వీటి నుంచి సంప్రదాయ వేడుక, గ్లామర్‌తో కూడిన రెసెప్షన్ లేదా పండగ సంబరాలైనా ప్రతీ వధువు తన ప్రత్యేక స్టైలుకు సరిపోయేది ఎంచుకోవచ్చు.


ఈ ఆవిష్కరణ సందర్భంగా ఈ ప్రత్యేక ఆభరణాలు ధరించి మురిసిపోయే ఆధునిక వధువు ప్రత్యేక క్షణాలను మరింత మధురంగా మార్చి ఆ స్ఫూర్తిని చాటిచెప్పేందుకు రిలయన్స్ జువెల్స్ ‘బ్రైడ్స్‌ ఆఫ్‌ వివాహం’ పేరుతో ప్రత్యేక ప్రచారానికి – https://www.youtube.com/watch?v=Oy7jKV8zswo శ్రీకారం చుట్టింది.

వివాహం కలెక్షన్ ఆవిష్కరణ సందర్భంగా రిలయన్స్ జువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ మాట్లాడుతూ, ” భారతదేశంలో వివాహాలు అనేవి ఎంతో లోతైన ఉద్వేగం, సాంస్కృతి ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఈ వేడుకల్లో వధువు ఆభరణాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సంప్రదాయానికి ప్రతిరూపం మా వివాహం కలెక్షన్. ప్రాంతీయ వారసత్వం, ఆధునిక అభిరుచి కలబోతగా ఈ కలెక్షన్‌లోని ప్రతి సెట్ నిలుస్తూ నేటి వధువు వ్యక్తిత్వానికి, వ్యక్తిగత స్టైల్‌ను అందిపుచ్చుకుంటాయి. కేవలం పెళ్లి రోజున ధరించేందుకే కాదు ఏళ్ల తరబడి ఈ ఆభరణాలు ఆనందాన్ని అందిస్తాయి.” అన్నారు.


ఈ వివాహ సీజన్ వేడుకల కోసం కాబోయే వధువులకు రిలయన్స్ జువెల్స్ నవంబర్ 11, 2024 వరకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 25% వరకు, డైమండ్ విలువ, మేకింగ్ ఛార్జీలపై 30% వరకు ఆకర్షణీయ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఎంతో విలువైన అద్భుతమైన ఆభరణాలపై పెట్టుబడి పెట్టేందుకు వధువులకు ఇది చక్కని అవకాశం. ఆన్‌లైన్‌, 185కు పైగా నగరాల్లోని రిలయన్స్ జువెల్స్ స్టోర్స్‌లో ఈ అవకాశం ఉంది.

error: Content is protected !!