Fri. Nov 8th, 2024
Reliance-Jio_safetyweek

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, 9 మార్చి 2023: ప్రముఖ టెలి కమ్యూనికేషన్స్ సంస్థ రిలయన్స్ జియో తెలంగాణ రాష్ట్రంలోని తమ కార్యాలయాల్లో 52వ జాతీయ భద్రతా వారోత్సవాలను జరుపుకుంటోంది. తన ఉద్యోగులు, కాంట్రాక్టర్ల భాగస్వామ్యంతో జియో మార్చి 4 నుంచి 10 వరకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తోంది.

ఏడాది పొడవునా సురక్షితంగా పని చేయాలనే నిబద్ధతను పునరుద్ధరించడం , వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రత (OH&S) పై అవగాహన పెంపొందించ డమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం.

భద్రతావారోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జియో కార్యాలయాల్లో వివిధ కార్యక్రమాలు, పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యకలాపాలలో కార్మికులకు నిర్మాణ సామగ్రి, యంత్రాలు, పరికరాలను సురక్షితంగా నిర్వహించడంపై ప్రత్యేక ప్రదర్శన, మాక్-డ్రిల్ శిక్షణ ఇవ్వనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జియో తెలంగాణ బృందం సభ్యులు పని ప్రదేశాలలో ప్రమాదాలు, ప్రమాదాలను నివారించడానికి అనుసరించాల్సిన భద్రతా ప్రోటోకాల్‌లపై అవగాహన,నిబద్ధతను పెంచడానికి ప్రతిజ్ఞ చేశారు.

Reliance-Jio_safetyweek

కట్టుదిట్టమైన భద్రతా నియమాలు, నియంత్రణ చర్యలను అమలు చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం భద్రతా థీమ్ ”OUR AIM- ZERO HARM” ని స్వాగతించడానికి , ఆచరణలో పెట్టడానికి జియో తెలంగాణ ముందుకు వచ్చింది.

జియో లక్ష్యాలలో ఒకటి కార్మికులను భద్రతా ప్రమాణాలు పాటించేలా ప్రేరేపించడం, ఉద్యోగుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని సృష్టించడం. అంతేకాకుండా, నెట్‌వర్క్, ఆపరేషన్, మెయింటెనెన్స్,హెచ్‌ఎస్‌ఇ సభ్యుల ప్రసంగాలతో భద్రతా అవగాహన సెషన్‌లు, జెండా వందనాలు, భద్రతా ప్రతిజ్ఞ, భద్రతా బ్యాడ్జ్, బ్యానర్, పోస్టర్ ప్రదర్శన,భద్రతా అవగాహన పై ర్యాలీ‌లు కూడా నిర్వహించనున్నారు.

error: Content is protected !!