365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, 19 ఏప్రిల్ 2021:పవిత్రమైన రంజాన్ స్ఫూర్తిని వేడుక చేయడంతో పాటుగా ఉపవాస దీక్షలోని అతిథులకు సౌకర్యం అందించేందుకు నోవోటెల్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఇప్పుడు ప్రత్యేకమైన సెహరీ, ఇఫ్తార్ మెనూను జోడించింది. చెఫ్ వరుణ్ ఎం బీ, ఎగ్జిక్యూటివ్ చెఫ్, నొవొటెల్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రత్యేకంగా చవులూరించే మెనూను తీర్చిదిద్దారు. ఈ మెనూ అతిథులకు ఉపవాసం ఆరంభించేందుకు, దీక్షను ముగించేందుకు తోడ్పడుతుంది. ఈ డిష్‌లను ఆధీకృత పదార్థాలు వినియోగించి తయారుచేయడంతో పాటుగా అతిథులకు ఇంటి వద్దనే ఉన్న అనుభూతులను సైతం అందిస్తుంది. నొవొటెల్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఇప్పుడు ప్రేయర్ మ్యాట్స్ లాంటి వసతులను అందించడంతో పాటుగా ప్రార్థనల వేళ సువాసనలను సైతం అందిస్తుంది.

సెహరీ, ఇఫ్తార్ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన మెనూ ను రూమ్‌లోకి ఆర్డర్ చేసుకోవచ్చు లేదా అతిథులు దీనిని రెస్టారెంట్‌లో ఆస్వాదించవచ్చు. ప్రత్యేకమైన సెహరీ మెనూలో సంప్రదాయ ఆహార అవకాశాలు అయినటువంటి చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, డ్రై ఫ్రూట్స్, ప్రత్యేకమైన డ్రింక్స్, మలబార్ పరాఠా, వెజ్ గ్రేవీ, రైతా, ప్రత్యేకంగా తయారుచేసిన దాల్ ,మరెన్నో ఉన్నాయి. ఇఫ్తార్ మెనూలో కోసిన పళ్లు, తాజా జ్యూస్, ఫ్లేవర్డ్ వాటర్, విభిన్నమైన డ్రై ఫ్రూట్స్ , మరెన్నో ఉన్నాయి.

ఈ సందర్భంగా రుబిన్ చెరియన్, జనరల్ మేనేజర్, నోవోటెల్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మాట్లాడుతూ ‘‘రంజాన్ స్ఫూర్తిని వేడుక చేయడంతో పాటుగా మా అతిథులకు మరింత సౌకర్యం అందించేందుకు ప్రత్యేకమైన సెహరీ , ఇఫ్తార్ మెనూను మేము అందిస్తున్నాం. ఇవి ఉపవాసదీక్షలో ఉన్న మా అతిథులకు విభిన్న రుచులను అందించడంతో పాటుగా విభిన్నమైన రంజాన్ ప్రత్యేకతలనూ అందిస్తాయి. మా ఎగ్జిక్యూటివ్ చెఫ్ వరుణ్ , అతని బృందం ఇప్పుడు సంప్రదాయ పదార్థాలు, స్పైసెస్ వినియోగించి వీటిని తయారుచేశారు. అతిథులందరూ కూడా సంప్రదాయ డిషెస్ తియ్యందనాలను ఈ పవిత్రమాసంలో ఆస్వాదించవచ్చు’’ అని అన్నారు.

