365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢీల్లీ,జూలై 26, 2021: జాతీయ రహదారుల వెంబడి మద్యం దుకాణాలను తొలగించే అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.గౌరవనీయమైన సుప్రీంకోర్టు 2016 సివిల్ అప్పీల్ నెం 12164-12166 (తమిళనాడురాష్ట్రం ఇతరులు Vs కే. బాలు,ఇతరులు )లో15.12.2016,30.11.2017 న జారీ చేసిన ఉత్తర్వులలో జాతీయ రహదారులు,రాష్ట్ర రహదారుల వెంబడి మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడానికి లైసెన్సులను జారీ చేయరాదంటూ ఆదేశాలు జారీ , ,జాతీయ లేదా రాష్ట్ర రహదారుల వెలుపలి అంచు నుండి 500 మీటర్ల దూరం లేదా రహదారిసర్వీస్ లేన్ లో దుకాణాల ఏర్పాటుకు లైసెన్సులను మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 20,000 లేదా అంతకంటే తక్కువ జనాభా కలిగి ఉన్న స్థానిక సంస్థలలో అధికార పరిధిలో ఈ దూరం 500 మీటర్ల నుంచి 220 మీటర్లకు తగ్గించబడుతుంది.
సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఇంతేకాకుండా, మద్యం తాగి వాహనాలను నడిపే వారిపై మోటారు వాహనాల చట్టం 1988 లోనిసెక్షన్ 185 ప్రకారం కేసులను నమోదు చేసి వారికి జరిమానా లేదా జైలు శిక్ష విధించడం లేదా రెండు శిక్షలను విధించడానికి వీలు ఉంది. మద్యం తాగి వాహనాలను నడపడం వల్ల కలిగే నష్టాలపై మంత్రిత్వ శాఖ ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
జాతీయ రహదారుల అభివృద్ధి, జాతీయ రహదారుల వెంబడి ఉన్న ఆస్తులకు వెళ్ళడానికి వీలు కల్పించే అంశాలను మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తూ తగిన చర్యలను తీసుకుంటున్నది. జాతీయ రహదారుల రైట్ ఆఫ్ వే పరిధిలోకి రాని ఆస్తుల వినియోగం,వాటిలో జరిగే వ్యాపారాలపై మంత్రిత్వ శాఖకు నియంత్రణ కలిగి లేదు. మద్యం దుకాణాల తొలగింపు అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం అయినందున దీనిపై ప్రభుత్వం డేటాను సేకరించదు.
ఈ సమాచారాన్ని కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్‌గడ్కరీ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో అందించారు.