365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్, హైదరాబాద్, ఫిబ్రవరి 7,2025: నగరంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రకటనల యూనిపోల్స్‌పై అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. శుక్రవారం హైడ్రా బృందం మున్సిపల్ అధికారుల సమక్షంలో అనుమతి లేని హోర్డింగులను తొలగించింది.
ప్రభుత్వానికి రుసుములు చెల్లించకుండా రహదారుల ఇరువైపుల భారీ హోర్డింగులను ఏర్పాటు చేసిన వారి మీద నగర పాలక సంస్థ దృష్టి సారించింది. ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయం మార్గంలో ఉన్న అనధికారిక యూనిపోల్స్ తొలగింపు ప్రక్రియను హైడ్రా ప్రారంభించింది.
హోర్డింగుల తొలగింపునకు ముందు నగర శివారు మున్సిపల్ అధికారులతో హైడ్రా సమీక్ష సమావేశం నిర్వహించింది. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన యూనిపోల్స్‌ను గుర్తించి, వాటిని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది.
ఇది కూడా చదవండి: అమీన్ పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటన
This Also Read: Top 10 Hospitals Providing Free Medical Advice and Treatment in India
ప్రస్తుతం ప్రాధాన్యతగా భారీ హోర్డింగుల తొలగింపునకు చర్యలు చేపట్టిన హైడ్రా, శుక్రవారం రంగంలోకి దిగి శంషాబాద్ విమానాశ్రయ మార్గంలో ఉన్న అనధికారిక యూనిపోల్స్‌ను తొలగించింది. అధికారులు వరుసగా నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశముంది.