Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, ఫిబ్రవరి 15,2022:ఆరు కోట్ల గ్రామీణ జనాభాకు డిజిటల్‌ సాక్షరత కల్పించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ప్రధాన మంత్రి గ్రామీణ్‌ డిజిటల్‌ సాక్షరత అభియాన్‌కు (పీఎంజీదిశా) చేయూత అందిం చేందుకు సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్‌తో (కామన్‌ సర్వీసెస్‌ సెంటర్లు) రెనో ఇండియా భాగస్వామిగా చేరింది.

భారతదేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ, సెమి అర్బన్‌ ప్రాంతాల్లోని జనాభాకు నైపుణ్యం కల్పించేందుకు వారిలో వృత్తిపరమైన నైపుణ్యాల పెంపుదలకు సాయపడేందుకు సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్‌కు రెనో ఇండియా ఐదు కార్లను హైదరాబాద్‌ సమీపంలోని కడ్తాల్‌ గ్రామంలో విరాళంగా అందజేసింది. వీటి ద్వారా భారతదేశవ్యాప్తంగా సంవత్సరకాలంలో 600 గ్రామ పంచాయతీలు చుట్టురావాలన్నది  ఉద్దేశం.

రెనో ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈఓ & మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెంకట్రామ్‌ మామిళ్లపల్లె మాట్లాడుతూ, “సాధికార సమాజ నిర్మాణంలో డిజిటల్‌ సాక్షరత అనేది ఒక ముఖ్య అంశంగా ప్రభుత్వం భావిస్తోంది. ఆ దార్శనికతకు అనుగుణంగా డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో కీలకంగా నిలుస్తున్నసీఎస్‌సీతో కలిసి డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ పెంపొందించేందుకు తోడ్పాటు అందిస్తుండటం మాకు సంతోషం కలిస్తోంది.  రెనో కార్లు “చక్రాలపై ఉండే విజ్ఞాన భాండగారాలు”గా వ్యవహరిస్తాయి, ఇవి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సమాచారం, విజ్ఞానం, అవసరమైన నైపుణ్యాలు అందిస్తూ సాధికారతతో చేయూతగా నిలుస్తాయి.

“గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలకు ఆర్థికసాధ్యత పరంగా మాత్రమే కాదు నైపుణ్యం, జ్ఞాన సామర్థ్యం పెంపొందించడం ద్వారా సాధికారత కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా  గ్రామీణ సమైక్యతలో ఇది  ఒక ముఖ్యమైన దశ” అన్నారు.

రెనో ఇండియా, సీఎస్‌సీ అకాడమీ భాగస్వామ్యం గ్రామీణ ప్రాంతాల్లోని పౌరులకు కంప్యూటర్‌ లేదా  ల్యాప్‌టాప్‌ వంటి డిజిటల్‌ పరికరాలు ఆపరేట్‌ చేయడం, ఇంటర్నెట్‌ బ్రౌజ్ చేయడం, ప్రభుత్వ వెబ్‌సైట్లు, బ్యాంకింగ్‌ సేవలు పొందడం, డిజిటల్ చెల్లింపులు చేపట్టడంలో శిక్షణ అందించి వారికి సాధికారత కల్పిస్తుంది. శిక్షణ కోర్సులకు సంబంధించిన సమాచార పంపిణీలో రెనో కార్లు పాల్గొంటాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఆర్థిక, డిజిటల్‌ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు, డిజిటల్‌ సాధికార సమాజంగా పరివర్తన చెందుతున్న భారత్‌లో వారు కూడా చురుగ్గా పాల్గొనేలా ఇవి దోహదపడతాయి. ఈ కార్ల ద్వారా  కొవిడ్‌ జాగ్రత్తలు, ప్రోటోకాల్స్ గురించి అవగాహనను  వీఎల్‌ఈలు (విలేజ్‌ లెవల్‌ ఎంటర్‌ప్రెన్యూర్లు) పెంచుతారు.

సీఎస్‌సీ ఎస్‌పీవీ మేనేజింగ్ డైరెక్టర్‌ దినేశ్‌ త్యాగి మాట్లాడుతూ, “సీఎస్‌ఈ పునాది విద్యపై ఆధారపడి ఉంది. ప్రధాన మంత్రి గ్రామీణ్‌ డిజిటల్‌ సాక్షరత అభియాన్‌కు (పీఎంజీదిశా) కింద ఆరు కోట్ల మంది గ్రామీణ పౌరులకు శిక్షణ ఇవ్వాల్సిన గురుతర బాధ్యత మా పై ఉంది. రెనో ఇండియా అందిస్తున్న ఈ అపూర్వమైన చేయూతకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా టీమ్స్ ట్రైనింగ్‌ నిర్వహించేందుకు సహకరించే ఈ కార్లను వేర్వేరు ప్రాంతాల్లో ఉంచుతాం. వీటి ద్వారా గ్రామీణ, సెమి అర్బన్ ప్రాంతాల్లో డిజిటల్‌ అంతరం మరింత తగ్గుతుంది” అన్నారు.

సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్‌ అనుబంధ సంస్థ సీఎస్‌సీ గ్రామీణ్‌ ఈస్టోర్‌ను గ్రామీణ ప్రాంతాల్లో బలోపేతం చేసి మారుమూల ప్రాంతాల్లోని కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు ఆ సంస్థతో గతేడాది రెనో భాగస్వామిగా చేరింది. దీని ద్వారా రెనో ఇండియా ప్రొడక్ట్‌ రేంజ్‌ సీఎస్‌ఈ గ్రామీణ్‌ ఈ స్టోర్‌లో లిస్ట్ అయింది. గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్లకు ఇది అందుబాటులో ఉంటుంది.

error: Content is protected !!