Mon. Dec 16th, 2024
renault_India365t

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జనవరి 6,2023:కార్ల తయారీ కంపెనీలు అనేక రకాల ఆఫర్లు ఇస్తుంటాయి. స్టాక్‌ను క్లియర్ చేయడానికి కంపెనీలు తమ కార్లను ఆఫర్‌ల ద్వారా విక్రయిస్తుంటాయి.

అందులో భాగంగా జనవరి నెలలో రెనో కస్టమర్లకు కొత్త ఆఫర్లు అందిస్తోంది. ఎలాంటి ఆఫర్లు ఉన్నాయంటే..?

ఈ ఆఫర్‌లలో కారు అన్ని వేరియంట్‌లపై రూ.15,000 బెనిఫిట్ పొందవచ్చు. రెనాల్ట్ చిన్న కారు క్విడ్‌ జనవరిలో రూ. 91,000 ఆఫర్‌ అందిస్తోంది. ఎక్స్ చేంజ్ పై రూ. 15,000 ప్రయోజనం, రూ. 12,000 కార్పొరేట్ బెనిఫిట్ అందించనున్నారు.

ఇవి కాకుండా, రీ-లైవ్ స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 39,000 లాయల్టీ ప్రయోజనం రూ. 10,000 ప్రయోజనం ఉంటుంది.

రెనాల్ట్ కాంపాక్ట్ SUV కైగర్‌పై కంపెనీ రూ. 1.14 లక్షల తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ కింద, SUV అన్ని వేరియంట్లపై రూ. 15,000 నగదు ప్రయోజనం, రూ. 20,000 ఎక్స్చేంజ్ బెనిఫిట్ ఇస్తుంది.

renault_India365t

కంపెనీ కొన్ని వేరియంట్లపై రూ.12,000 కార్పొరేట్ బెనిఫిట్ కూడా అందిస్తోంది. ఇవి కాకుండా, రీ-లైవ్ స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 57,000 లాయల్టీ బెనిఫిట్ రూ.10,000 బెనిఫిట్ ఉంది.

Renault సరసమైన MPV ట్రైబర్ భారీ ఆఫర్‌లు..ఈ MPVపై కంపెనీ రూ.1.19 లక్షల విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద, SUV అన్ని వేరియంట్లపై రూ. 25,000 నగదు ప్రయోజనం, రూ. 25,000 ఎక్స్చేంజ్ బెనిఫిట్ ఇస్తున్నారు.

కంపెనీ కొన్ని వేరియంట్లపై రూ.12,000 కార్పొరేట్ ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. ఇవి కాకుండా, రీ-లైవ్ స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 47,000 లాయల్టీ రూ.10,000 బెనిఫిట్ ఉంటుంది.

error: Content is protected !!