Sat. Dec 28th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,జ‌న‌వ‌రి 11,2022: తిరుమల దివ్య క్షేత్రంలో జ‌న‌వ‌రి 13వ తేదీన వైకుంఠ ఏకాదశికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాం కలుగకుండా మరింత మెరుగైన సేవలందించాలని టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి కోరారు. తిరుమ‌ల‌లోని ఆస్థాన మండ‌పంలో మంగ‌ళ‌వారం సాయంత్రం టిటిడి డెప్యూటెషన్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన అద‌న‌పు ఈవో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జ‌న‌వ‌రి 13 నుంచి 22వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నానికి విచ్చేసే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

error: Content is protected !!