365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 31, 2025: ప్రముఖ చారిత్రక, పురావస్తు పరి శోధకుడు, రచయిత మైనా స్వామి ని రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారంతో సత్కరించింది. ఉగాది సందర్భంగా వివిధ రంగాలలో సేవలు అందించిన పలువురు ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం పతకం, ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందుకున్నారు.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జరిగిన ఉగాది పురస్కారాల ప్రధానోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మైనా స్వామి పురస్కారాన్ని అందుకున్నారు.

శాసన పరిశోధన, లేపాక్షి వీరభద్రాలయంతో సహా పలు ఆలయాలకు సంబంధించి విశేషంగా పుస్తకాల ముద్రణ, తదితర అంశాలను పరిగణన లోకి తీసుకొని సాంఘిక సేవా విభాగంలో పురస్కారాన్ని అందిస్తున్నట్టు సాంస్కృతిక శాఖ
ప్రకటించింది.

Read this also…Actor Krishna Sai Extends Financial Support to Cine Photojournalist RK Choudhary

ఇది కూడా చదవండి..MG అస్టర్: భారతదేశపు మొట్టమొదటి AI SUV ఇప్పుడు ‘బ్లాక్‌బస్టర్ SUV’!

విజయనగర సామ్రాజ్యంపై విస్తృతంగా పరిశోధన చేస్తున్న మైనా స్వామి గుర్తింపునకు నోచుకోని, అపరి స్కృతంగా ఉన్న నూటికి పైగా శాసనాలను ఆయన బాహ్య ప్రపంచానికి తెలియజేశారు తెలుగు కన్నడ సంస్కృత భాషల్లో శాసనాలను ఆయన పరిష్కరించారు.

మైనా స్వామికి పురస్కారం లభించడం పట్ల జిల్లాకు చెందిన పలువురు రచయితలు, పరిశోధకులు ఆయనకు అభినందనలు తెలిపారు.