365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 10,2024 : భారత దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. రతన్ టాటా గత కొన్ని రోజులుగా బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స సమయంలో పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచారు. ఆయన మరణాన్ని టాటా గ్రూప్ బుధవారం అర్థరాత్రి ధృవీకరించింది.
పారిశ్రామికవేత్త రతన్ టాటా అనారోగ్యంతో బాధపడుతున్నారనే వార్తలు సోమవారం పుకార్లు రాగా దీనిపై రతన్ టాటా స్వయంగా రియాక్ట్ అయ్యారు. ‘ఎక్స్’లో పోస్ట్ చేసి పుకార్లు వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రొటీన్ చెకప్ కోసం వచ్చానని చెప్పారు. అయితే బుధవారం సాయంత్రం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో ఉంచారు. అర్థరాత్రి, వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా రతన్ టాటా మరణాన్ని సోషల్ మీడియాలో మొదటగా తెలియజేశారు. దీని తర్వాత టాటా గ్రూప్ కూడా అతని మరణాన్ని ధృవీకరించింది.
వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా తన ఎక్స్ హ్యాండిల్‌లో గడియారం టిక్ టిక్ అనడం ఆగిపోయిందని పోస్ట్ చేశాడు. టైటాన్ మరణించింది. #రతన్ టాటా సమగ్రత, నైతిక నాయకత్వం, దాతృత్వానికి ఒక ఉదాహరణ, ఆయన వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ఆయన మన జ్ఞాపకాలలో ఎప్పుడూ ఉన్నతంగా ఉంటారు.