365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 4,2025: ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేశారని సమాచారం. ప్రాథమిక వివరాల ప్రకారం, ఆమె అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వెంటనే ఆమెను కుటుంబసభ్యులు సమీపంలోని హోలిస్టిక్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి...వరి సాగులో విప్లవాత్మక మార్పులు – 50% యూరియా వినియోగం తగ్గే అవకాశం
ఇది కూడా చదవండి...రాజకీయ వ్యూహం : అందరికీ న్యాయం చేసేందుకు చంద్రబాబు కీలక నిర్ణయాలు..
ఇది కూడా చదవండి...టీచ్ ఫర్ ఇండియా 2025 ఫెలోషిప్ తుది గడువు ప్రకటింపు..
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్పన
ప్రస్తుతం కల్పన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కుటుంబసభ్యులు ఈ ఘటనపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

కుటుంబ విభేదాలే కారణమా?
కల్పన హైదరాబాద్ నిజాంపేట్ లోని వర్టెక్స్ ప్రివిలేజ్ అపార్ట్మెంట్లో తన భర్తతో కలిసి నివాసం ఉంటున్నారు.కల్పన ఈ ఆత్మహత్యాయత్నానికి అసలు కారణాలు తెలియలేదు.
Read this also...Teach For India Announces Final Application Deadline for 2025 Fellowship
Read this also...Jo Sharma Makes a Stunning Appearance at Oscars 2025 for M4M Movie!
ఇది కూడా చదవండి...ఆస్కార్ 2025 వేడుకలో మెరిసిన ‘ఎం4ఎం’ హీరోయిన్ జో శర్మ!
ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె కుటుంబ సభ్యుల వాంగ్మూలం తీసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. కల్పన ఆత్మహత్యాయత్నానికి గల అసలు కారణాలను గుర్తించేందుకు పోలీసులు పరిశోధన చేస్తున్నారు.