Thu. Dec 12th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ,జూన్ 13,2023: కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ద్వారా కొలవబడిన భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో 4.25 శాతానికి పడిపోయింది. ఆహార పదార్థాల ధరల పతనం దీనికి ప్రధాన కారణం. ఏప్రిల్‌లో ఇది 4.70 శాతంగా ఉంది.

ఆహార ద్రవ్యోల్బణం కూడా ఏప్రిల్‌లో 3.84 శాతం నుంచి మేలో 2.91 శాతానికి తగ్గింది.

గణాంకాలు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం మే 2022లో ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 7.04 శాతంగా ఉంది, అదే సమయంలో ఆహార ద్రవ్యోల్బణం 7.97 శాతంగా ఉంది.

సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం ఆర్‌బిఐ లక్ష్యం 2 శాతం నుంచి 6 శాతానికి దిగువన ఉండడం ఇది వరుసగా మూడో నెల.

ఏప్రిల్‌తో పోలిస్తే మేలో తృణధాన్యాలు, నూనెలు,కొవ్వులు, పండ్లు, పానీయాలతోపాటు దుస్తులు,పాదరక్షల ధరలు తగ్గాయి.

error: Content is protected !!