vizag-steel-plant

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విశాఖపట్టణం, జూలై 9,2022: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఉక్కు మంత్రిత్వ శాఖ 2022 జూలై 4నుంచి10వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఐకానిక్ వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్( ఆర్ఐఎన్ఎల్) అనేక కార్యక్రమాలను నిర్వహించింది. ఐకానిక్ వారోత్సవాల్లో భాగంగా విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఆర్ఐఎన్ఎల్ సహకారంతో ఐఎన్‌ఎస్‌డిఎజి ‘పెరుగుతున్న ఉక్కు వినియోగం, భవిషత్తులో ఉక్కు అవసరాలు’ అనే అంశంపై ఒక సెమినార్ నిర్వహించింది.

vizag-steel-plant

ఆర్ఐఎన్ఎల్ కు చెందిన 80 మంది ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్న సెమినార్ ప్రత్యక్ష ప్రసారం సంస్థ హెచ్ ఆర్ డీ కేంద్రంలో జరిగింది. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆర్ఐఎన్ఎల్ మార్కెటింగ్ కార్యాలయాలకు చెందిన 60 మంది ఎగ్జిక్యూటివ్‌లు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఐఎన్‌ఎస్‌డిఎజి కార్యకలాపాలను సంస్థ సీనియర్ అధికారి అరిజిత్ గుహా పీపీటీ ప్రదర్శన ద్వారా వివరించారు. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఉక్కు వినియోగాన్ని ఎక్కువ చేసేందుకు ఐఎన్‌ఎస్‌డిఎజి చేపడుతున్న చర్యలను వివరించారు. వివిధ అంశాలపై సెమినార్ లో పాల్గొన్న వారు అడిగిన ప్రశ్నలకు రిసోర్స్ పర్సన్లు సమాధానాలు ఇచ్చారు.

vizag-steel-plant

దేశంలో ఉక్కు ఉత్పత్తి, వినియోగం, దేశంలో ఉక్కు వినియోగం తక్కువగా ఉండటం వెనుక ఉన్న కారణాలు, ఉక్కు వినియోగాన్ని ఎక్కువ చేసేందుకు అమలు జరగుతున్న చర్యలు, ఐఎన్‌ఎస్‌డిఎజి అమలు చేస్తున్న చర్యలను సెమినార్ లో ప్రధానంగా చర్చించారు. వివిధ రంగాల్లో జరుగుతున్న ఉక్కు వినియోగం వివరాలను అధికారులు వివరించారు. దేశంలో ఉక్కు వినియోగం తక్కువగా ఉండడానికి గల కారణాలను విశ్లేషించారు. ఉక్కు వినియోగాన్ని ఎక్కువ చేయడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. సెమినార్ లో ఐఎన్‌ఎస్‌డిఎజి కార్యకలాపాలు, సంస్థ అందిస్తున్న సాంకేతిక సేవలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.

vizag-steel-plant

గ్రామీణ ప్రాంతాల్లో ఉక్కు వినియోగాన్ని ఎక్కువ చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో స్టీల్ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌లను ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం వంటి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా చూసేందుకు ఖచ్చితంగా లాభాలను పొందేందుకు సరైన ప్రాజెక్ట్‌ల గుర్తించడం క్షేత్ర స్థాయిలో ఉక్కు వినియోగాన్ని ఎక్కువ చేయడం వంటి కార్యక్రమాలను అధికారులు వివరించారు. దీనికోసం హై టెన్సిల్,హై పెర్ఫార్మెన్స్ స్టీల్ వంటి ప్రత్యేక స్టీల్‌ల వినియోగాన్ని ప్రచారం చేయడానికి ప్రత్యేక ప్రాజెక్ట్‌లను చేపట్టడం, వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహించడం ద్వారా పరిశ్రమ-విద్యాపరమైన సమన్వయం సాధించేందుకు చర్యలు అమలు జరుగుతున్నాయి.