Thu. Nov 7th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జులై 9,2023: ఇన్నోవేషన్, ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధికి స్టార్టప్ లు చోదక శక్తి అని, తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. నగరంలో జరిగిన ‘RJEYS ఇన్ఫినిటీ సొల్యూషన్స్’ రెండో వార్షికోత్సవంలో జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. స్టార్టప్ లు కొత్త దృక్పథాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, సమస్య పరిష్కారానికి చురుకైన విధానాలను తీసుకొస్తాయన్నారు.

ప్రభుత్వాలు, పారిశ్రామిక దిగ్గజాలు, సమాజం స్టార్టప్ ల అపార సామర్థ్యాన్ని గుర్తించి మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. ‘రన్ ఫర్ ది సక్సెస్’ అనే ఆర్జేఈవైఎస్ కార్నివాల్ ట్యాగ్ లైన్ తనను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా కర్లపాలెం గ్రామానికి చెందిన ఆర్జేఈవైఎస్ కంపెనీ సీఈవో రత్నరాజు జెట్టి, రెండేళ్లలో దాదాపు 50 మందికి పైగా ఉపాధి కల్పించారు. ‘ఈ సందర్భంగా…రత్న రాజు మాట్లాడుతూ.. ఆర్జేఈవైఎస్ ఇన్ఫినిటీ సొల్యూషన్స్ రెండో వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉంది.

ఈ మైలురాయి చేరుకోవడంలో మా బృందం కృషి, అంకితభావం, నైపుణ్యం, అలాగే మా క్లయింట్ల విశ్వాసం, మద్దతు ఉంది అని తెలిపారు. మేము ముందుకు సాగుతున్నప్పుడు, నిరంతరం అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ల్యాండ్ స్కేప్ లో వృద్ధి చెందడానికి మా ఖాతాదారులకు శక్తినిచ్చే సృజనాత్మక పరిష్కారాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని, త్వరలోనే పలు దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు.

రెండో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సంస్థ తన సిబ్బంది, భాగస్వాముల కోసం పలు కార్యక్రమాలను సంస్థ నిర్వహించింది. ఈ సందర్భంగా, ఉద్యోగులకు అవార్డులను కూడా ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ‘గైన్ సైట్’ సంస్థ ప్రతినిధులు శ్రీధర్ గొల్లపల్లి, సుధీర్ గోదా, పవన్ తాళ్లపల్లి తదితరులు కూడా పాల్గొన్నారు.

error: Content is protected !!