Freedom_India365

స్వాతంత్రోద్యమం కాలంలో పాఠకులకు ఉద్యమ పాఠాలు నేర్పిన పత్రికలు.

ఆనాడు జర్నలిజం విలువలతో సమాజం కోసం ఉద్యమకారులు గా,పత్రికా సంపాదకులు గా…పోరాటం

ప్రత్యేక ఘన చరిత్ర కలిగిన “ఆంధ్రపత్రిక”- “కృష్ణాపత్రిక”లు


365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 20,2023: సుమారు 115 సంవత్స రాలుగా తెలుగు పత్రికా రంగంలో ఇప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం కలిగి, ప్రజాక్షేత్రంలో ప్రజల మన్నన పొందుతూ…టెక్నాలజీ కి అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ రాష్ట్రంలో నడుస్తున్న పత్రిక “ఆంధ్ర పత్రిక”గా చెప్పుకోవచ్చు. 1908 లో కాశీనాధుని నాగేశ్వరరావు గారిచే బొంబాయి నుంచి ఆంధ్ర పత్రికను వారపత్రికగా ప్రారంభించడం జరిగింది.

అప్పట్లో బొంబాయి లో తత్వ బోధిని అనే ముద్ర ణాశాలలో ఈ ఆంధ్ర పత్రిక పేపర్ ని ముద్ర వేయడం చేసేవారు. అనంతరం ఈ ఆంధ్ర పత్రిక ఆంధ్రుల జాతీయ పత్రికగా అవతరించింది.

అప్పట్లో ఆంధ్రపత్రిక తొలి సంపాద కులుగా ఆవటిపల్లి నారా యణరావు పనిచేశారు. అనంతరం ఈ పత్రికను బొంబాయి నుండి 1914లో కొన్ని మార్పులకు అనుగుణంగా మద్రాసు (చెన్నై) కు మార్చడం జరిగింది.

నాడు మద్రాసు నుండి వెలవడుతున్న నేపథ్యంలో ఈ పత్రిక వారపత్రిక నుండి దినపత్రిక గా రూపు మారింది. దినపత్రికగా మార్పు చెందిన ఆంధ్ర పత్రికకు చెన్నై నగరం కేంద్రంగా కాశీనాధుని నాగేశ్వరరావు సంపాదకులుగా పని చేశారు.

Freedom_India365

ఈ పత్రిక దేశ స్వాతంత్ర ఉద్యమ కార్యక్రమాలను కథనాలను రాస్తూ… భారత దేశ స్వతంత్రానికి ఎంతో సహకారం అందించింది. సహాయ నిరాకరణ ఉద్యమంలో భారతీయ జాతీయ పత్రికగా గుర్తింపు పొందిన ఆంధ్ర పత్రిక మిగతా జాతీయ పత్రికలతో పాటు దేశ స్వాతంత్ర్య పోరులో జూలు విదిల్చింది,సింహంలా గాండ్రించి స్వాతంత్ర్య ఉద్యమ పోరాటాలకు అండగా నిలిచింది.

నూతన స్వాతంత్ర ఉద్యమంలోకి నడిపించే విధంగా ఉత్సాహపూరిత సంపాదకీయాలను ఈ పత్రిక ప్రచురించేది.చరిత్ర సాంస్కృతి సాహిత్యంశాల తో ఈ పత్రిక నడిచింది.

కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కృష్ణా జిల్లాకు చెందినవారు ఈయన ప్రాథమిక విద్యను స్వగ్రామంలో ఆ తర్వాత కృష్ణా జిల్లాలోని బందరు, గుంటూరు జిల్లా, చెన్నై వంటి ప్రాంతాలలో బిఏ వరకు చదువుకున్నా రు.

గడిచిపోయిన ఆనాటి రోజుల్లో తలనొప్పి, జలుబు వంటి వ్యాధులకు నివారణ కోసం అమృతాం జన్ కనిపెట్టింది ఈయనే. అమృతాంజన్ బామ్ కి అప్పట్లో ఎంతో పేరుండేది.

ఈ అమృతాంజన్ ప్రోడక్ట్ ద్వారా కూడా నాగేశ్వర రావు ఆర్థికంగా ఎదిగారు.

దేశభక్తితో సామాజిక బాధ్యత కలిగి ఒక పేపర్ ను ప్రారంభించి పేపర్ ద్వారా స్వాతంత్ర ఉద్యమాన్ని భుజాన మోస్తూ… స్వతంత్ర సాధనలో తన పత్రికను ఒక భాగంగా నిలిపారు. కాశీనాధుని నాగేశ్వరరావు ఎన్నో దానధర్మాలు కూడా చేశారు.

ఆయన వ్యక్తిత్వా న్ని బట్టి అడిగిన వారికి లేదనకుండా దానధర్మాలు చేసే విధానాన్ని చూసి కాశీనాధుని వారిని ఆ రోజుల్లోనే “విశ్వదాత” అని పిలిచేవారు.1908 లో ప్రారంభించబడిన ఆంధ్ర పత్రిక అప్పట్లో బొంబాయి నుంచి వెలువడిన ఒకే ఒక తెలుగు పత్రిక అంటే చాలా ఆశ్చర్యం.

అలాగే కాశీనాధు ని నాగేశ్వరరావు సాహసం అనేది తొలి తెలుగు జాతీయ పత్రికగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మిగతా తెలుగు దినపత్రికల కంటే ముందుగా బీజం వేసింది. కాశీనాథ నాగేశ్వరరావు కి తెలుగు భాషాభిమానం కూడా ఎంతో ఉండేది.ఈ భాషాభిమానంతోనే నాగేశ్వరరావు తమ నివాస ప్రాంతాన్ని నాడు తెలుగు పత్రికలకు కేరాఫ్ గా నిలిచిన చెన్నైకి మార్చు కున్నారు.

అప్పట్లో తెలుగు లో దినపత్రిక అంటూ ఏదీ రాలేదు.1908 నాటి నుండి ఇప్పటి వరకు ఎన్నో పత్రిక లు వచ్చాయి,పోయాయి. గాని 115 ఏళ్లు చరిత్ర కలిగి నాటినుండి,నేటి వరకు చిన్న,చిన్న అవాంతరాలు ఎదురయినప్పటికి.. నేటికి నడుస్తున్న తెలుగు దిన పత్రికల్లో ఆంధ్రపత్రిక అనేది ఒక ప్రత్యేక స్థానాన్ని పొందింది.

కాశీనాధుని నాగేశ్వరరావు చేతుల మీదుగా నడిచిన, ప్రస్తుతం వేరేవారి సంపాదకత్వంలో నడుస్తున్న ఆంధ్ర పత్రిక తెలుగు వారి జ్ఞానాభి వృద్ధికి, భాషాభివృద్ధికి ఎంతో తోడ్పాటున అందిం చింది. తెలుగు పత్రికలు ప్రారంభించి తెలుగువారికి దేశానికి ఎన్నో సేవలు అందించారు కాశీనాథని నాగేశ్వరరావు.

కాశీనాధుని నాగేశ్వరరావు సాహిత్య సేవను గుర్తించి అప్పట్లో విశాఖ పట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి “కళా ప్రపూర్ణ” అనే బిరుదు పొందారు.గాంధీ మహాత్ము ని పిలుపును అందుకొని కాశీనాధుని వారు 1930 లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.

సుమారు 65 ఏళ్ల వయసులో గాంధీజీ బాటలో నడిచి,ఆరు నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. అనం తరం మరికొన్ని సంఘటన లలో కూడా నాగేశ్వరరావు జైలు జీవితం గడపవలసి వచ్చింది.

ఒక పత్రిక సంపాదకులుగా తెలుగు భాషకు,పుట్టిన దేశానికి సేవ చేసిన నాగేశ్వరరావుని ప్రత్యేకంగా గుర్తించి ఆంధ్ర మహాసభ వారు 1923లో “దేశోద్ధారక” వంటి గొప్ప బిరుదును ఆయనకు ఇవ్వటం జరిగింది. విజయవాడలోని “దుర్గా కళామందిరం”కాశీనాధుని వారు కట్టించిందే…!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త తెలుగు రాష్ట్రంగా ఏర్పడిన నాయకులలో వారు ఒకరు. ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఒక పత్రిక సంపాదకులు ఆయన కాశీనాథని నాగేశ్వరరావు ఏప్రిల్ 1938లో కన్ను మూశారు.

దేశానికి రాష్ట్రానికి దిశా నిర్దేశం చేస్తూ గొప్ప పత్రికా సంపా దకులుగా పేరు సాధించి విలువలతో జర్నలిజం చేసి జర్నలిస్ట్ ల విధానాలను కాపా డుతూ..తెలుగు జర్నలిజంలో ఒక గట్టి పునాది రాయిలా.. ఆంధ్రపత్రికను నిలిపారు.

Freedom_India365

కాశీనాధుని నాగేశ్వరరావు నడిపిన ఈ పత్రికతో పోలిస్తే.. చరిత్ర అనేది ఏ పత్రికకు లేకపోయినా.. కొద్దిలో కొద్దిగా 1902 లో ప్రారంభమైన “కృష్ణా పత్రిక” “ఆంధ్రపత్రిక”కు సరి సమానంగా పోల్చబడి చూపబడుతుంది.

ఆ రోజుల్లో “కృష్ణా పత్రిక” “ఆంధ్రపత్రిక”లు అంటే ఆ పత్రికలకు ఉన్న గౌరవ స్థానం నాటికి-నేటికి ఇతర పత్రికలకు లేదు. నిజంగా విలువలు కలిగిన జర్నలిజానికి అక్షర బద్దంగా కట్టుబడి ఉన్న నాటి తెలుగు దినపత్రికల ఘన చరిత్ర ఇది.

ఈపూరి రాజారత్నం,సీనియర్ జర్నలిస్ట్, 9390062078.