365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్,జనవరి 19,2025: విజయనగర సామ్రాజ్యం లో వెలసిన నిర్మాణాలు మరియు హంపి కట్టడాలు అనే అంశంపై నేను పరిశోధన సాగిస్తున్నాను. నా పరిశోధనలో భాగంగా విజయనగర సామ్రాజ్య రాజధాని కేంద్రమైన హంపి నగరాన్ని సందర్శించాను.

1986 నుంచి హంపిని పలుమార్లు చూశాను. హంపి వైభవం పేరుతో ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం అనుబంధంలో 1986 డిసెంబర్లో ప్రచురితమైన నా వ్యాసం అప్పట్లో సంచలనం సృష్టించింది.

“విజయనగర సామ్రాజ్యం-హంపి” పై ఒక పరిశోధన గ్రంథాన్ని వెలువరించాలని, కొన్ని సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మరోసారి హంపికి వెళ్లడం జరిగింది. నా తాజా పర్యటనలో శ్రీక్రిష్ణదేవరాయల ముని ముని ముని మనవడైన రాజా క్రిష్ణదేవరాయ పాల్గొనడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.

మూడు రోజులపాటు క్షణం తీరిక లేకుండా పలు ప్రదేశాలు తిరిగాము. వారి ఇంట్లోని కత్తులు,పిడి బాకులు,రాజ ముద్రలు,తాళపత్రాల ప్రతి రాతలు నాకు చూపించారు.క్రిష్ణదేవరాయ 19 వ తరం వారు.

క్రిష్ణదేవరాయ ఆతిథ్యం అతి మధురం. వారికి నా కృతజ్ఞతాభివందనాలు.