Tue. Sep 17th, 2024
tv9-raviprakash

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 16,2022: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ టీ) హైదరాబాద్ బెంచ్ షాకిచ్చింది. ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టేసి రూ. 10 లక్షల జరిమానా విధించింది. టీవీ9కు చెందిన ఏబీసీ ప్రైవేటు లిమిటెడ్ వాటాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, సంస్థను స్వాధీనం చేసుకున్న వారిని నియంత్రించాలంటూ రవిప్రకాష్, కేవీఎన్ మూర్తి పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనల అనంతరం ట్రైబ్యునల్ నిన్న తీర్పు వెలువరించింది. టీవీ9 వాటాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అన్నీ చట్టబద్ధంగా జరిగాయని తేల్చి చెప్పింది.

tv9-raviprakash

వాటాలు కొనుగోలు చేసిన జూపల్లి జగపతిరావు, ఇతర డైరెక్టర్లను ఇబ్బంది పెట్టేందుకు రవిప్రకాష్ చేసిన చర్యలు అనైతికమని పేర్కొంది. వాటాల విక్రయ ఒప్పందం గురించి ఆయనకు కూడా తెలిసే జరిగిందని, అందులో ఆయన కూడా భాగమేనని పేర్కొంటూ.. ప్రతివాదులకు రూ.10 లక్షలు చెల్లించాలని ట్రైబ్యునల్ ఆదేశించింది.

error: Content is protected !!