365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,టోక్యో, ఏప్రిల్ 17,2025: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జపాన్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ప్రతినిధి బృందం తొలి రోజునే కీలక పెట్టుబడి ఒప్పందాన్ని కుదిర్చింది. జపాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజం మారుబేని కార్పొరేషన్, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రారంభంగా రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు ప్రకటించింది.
బుధవారం టోక్యోలో మారుబేని సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకుని, పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు. అనంతరం లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి సంతకాలు చేశారు.
ఇది కూడా చదవండి...వివో X200 అల్ట్రా కెమెరా ఫీచర్లు అదుర్స్: ఐఫోన్ 16 ప్రో మాక్స్‌ను సవాలు చేసే సామర్థ్యం!
ఇది కూడా చదవండి...భారత మార్కెట్లో తన సెకండ్ జనరేషన్ కోడియాక్ ఎస్‌యూవీని విడుదల చేసిన స్కోడా..
600 ఎకరాల్లో పార్క్, 30 వేల ఉద్యోగాలు లక్ష్యం
ఫ్యూచర్ సిటీలో దశలవారీగా 600 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇది తెలంగాణలో అభివృద్ధి కాబోయే తొలి పార్క్ అని ముఖ్యమంత్రి తెలిపారు. మారుబేని పార్క్ ద్వారా ఏకంగా 30,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని చెప్పారు. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
విదేశీ పెట్టుబడులకు హబ్‌గా తెలంగాణ

తెలంగాణలో వ్యాపారాలకు అనువైన వాతావరణం ఉందని, మారుబేని పెట్టుబడులకు అన్ని విధాలా ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఫ్యూచర్ సిటీ దేశంలోనే మొట్టమొదటి నెట్‌జీరో సిటీగా రూపుదిద్దుకుంటుందన్న ఆయన, జపాన్ సంస్థలు తెలంగాణను తమ స్వస్థలంగానే భావిస్తున్నాయన్న వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి దార్శనికతకు అభినందన
మారుబేని సంస్థ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దై సకాకురా మాట్లాడుతూ… ‘‘తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు అధికంగా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి దార్శనికత అభినందనీయం. ముందుగా ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు మారుబేని సంస్థ ముందుంటుంది’’ అని అన్నారు.
ఇది కూడా చదవండి...ఐఫోన్ 15పై అమెజాన్ భారీ డిస్కౌంట్: కేవలం రూ.28,830కే సొంతం
Read this also…SBI Card and Tata Digital Launch Tata Neu SBI Card for a Premium, Rewarding Shopping Experience
ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల్లో 410 గ్రూప్ కంపెనీలతో మారుబెని వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, ఇంధనం, విద్యుత్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ వంటి విభాగాల్లో కంపెనీ అగ్రగామిగా ఉంది. సుమారు 50,000 మంది ఉద్యోగులను నియమించుకుని అంతర్జాతీయంగా దూసుకెళ్తోంది.