365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్ 28,2022: లెక్కల్లో చూపని నగదును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పంజాగుట్ట పోలీసులు పట్టుకున్నారు. గురువారం రాత్రి ద్వారకాపురి కాలనీలో రూ.70 లక్షలు నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పి. కిషన్ రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, వేముల వంశీ ప్రయాణిస్తున్న కారును సాధారణ తనిఖీల సమయంలో ఆపి, బ్యాగుల్లో నగదు దొరికినట్లు పోలీసులు తెలిపారు. డబ్బు కు సంబంధించిన వివరాల గురించి ప్రశ్నించగా, వారు ఎటువంటి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదు, అంతేకాదు వాటికి సంబంధించి సరైన పత్రాలు కానీ ఏ ఇతర ఆధారాలు అందించలేదు.

ఇద్దరి వ్యక్తుల్లో ఒకరు హుజూరాబాద్‌కు చెందిన కిషన్‌రావు నిజాం కళాశాలలో కామర్స్ ఫ్యాకల్టీగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడని, ఇతను గతంలో ఏబీవీపీ అబిడ్స్ జోన్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసినట్లు తేలింది. ప్రస్తుతం పరారీలో ఉన్న బంజారాహిల్స్‌కు చెందిన మధు అనే వ్యక్తి నుంచి లెక్కల్లో చూపని నగదును సేకరించినట్లు అతడు అంగీకరించాడు. నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.