365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 29,2023: మే 1వతేదీ నుంచి మారుతున్న రూల్స్: ప్రతి నెలా మొదటి తేదీ నాడు, సామాన్యుల జేబుపై ప్రత్యక్ష ప్రభావం చూపే కొన్ని నిబంధనలలో మార్పు ఉంటుంది. ప్రతి నెలా మొదటి తేదీన ఎల్‌పిజి సిలిండర్ ధరలపై ప్రతి ఒక్కరూ ఓ కన్నేసి ఉంచుతారు. ఎందుకంటే..?
అన్ని చమురు కంపెనీలు ఈ రోజు ధరలను సమీక్షిస్తాయి. రేట్లు నవీకరిస్తాయి. గతనెలలో 14 కిలోల వంటగ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పు కనిపించలేదు. కానీ17 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగాయి. ఏప్రిల్ 1న 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలో రూ.91.50 భారీ కోత విధించింది. ఈసారి కూడా ఎల్‌పిజి సిలిండర్ ధర మళ్లీ మారవచ్చని భావిస్తున్నారు.
CNG ధరలు కూడా మారుతాయి..
CNG ధరలు కూడా వంట గ్యాస్ తరహాలో సమీక్షిస్తారు. దీనికి సంబంధించి అవసరమైన మార్పులు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని అనుసరించి, కంపెనీలు ఏప్రిల్‌లో ఢిల్లీ,ఇతర ప్రాంతాలలో CNG ధరలను తగ్గించాయి.
మే 1 నుంచి జీఎస్టీ నిబంధనలలో మార్పులు..
మే1 నుంచి జీఎస్టీ రూల్స్‌లో అతిపెద్ద మార్పు రాబోతోంది. కొత్త నిబంధన ప్రకారం, ఇప్పుడు 100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారవేత్తలు లావాదేవీ జరిగిన 7 రోజులలోపు ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (IRP)లో తమ లావాదేవీకి సంబంధించిన రసీదును అప్‌లోడ్ చేయాలి. దీని తర్వాత రసీదు అప్‌లోడ్ చేయరు.
మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో ఖాతా ఉంటే, ఈ సమాచారం మీకు ముఖ్యమైనది. మే 1 నుంచి, అటువంటి PMB ఖాతాదారు ATM నుంచి లావాదేవీలని చేయడానికి ప్రయత్నిస్తే, అతని ఖాతాలో తగినంత నిధులు లేకాపోతే, అప్పుడు బ్యాంక్ కస్టమర్‌పై ATM లావాదేవీ ఛార్జీని విధిస్తుంది. ఈ ఛార్జీ రూ. 10 + GST కూడా ఉంటుంది.