365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 5,2025 : ప్రస్తుతం ఉన్న ఏ రేషన్ కార్డును కూడా రద్దు చేయడం లేదని, ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మొద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని అధికారులు సూచించారు.

కొత్త సభ్యుల నమోదు కొనసాగుతూనే ఉంది..

ప్రస్తుత రేషన్ కార్డుల్లో కొత్త కుటుంబ సభ్యులను చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది. రోజూ మధ్యాహ్నం 3:00 గంటల నుంచి 5:00 గంటల మధ్య సంబంధిత సివిల్ సప్లైస్ కార్యాలయంలో అవసరమైన ఆధార్, పుట్టిన సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్లతో వెళ్లి ప్రక్రియను పూర్తిచేయవచ్చు.

కొత్త రేషన్ కార్డులు జారీ ఆలస్యం..

కొత్త రేషన్ కార్డుల జారీ కొంత ఆలస్యం అవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సిబ్బంది కొరత కారణంగా ఈ సమస్య తలెత్తిందని, అదనపు సిబ్బందిని నియమించిన తర్వాత పూర్తి స్థాయిలో పని కొనసాగుతుందన్నారు.

Read This also…RCB vs PBKS Face Off in IPL 2025 Final Tonight..

ఇది కూడా చదవండి…హ్యుందాయ్ కొత్త ప్రచారం: పంకజ్ త్రిపాఠి తో ‘లిజన్ టు యువర్ దిల్ ఆర్ ది డీల్స్’.. 

మధ్యవర్తులకు డబ్బులు ఇవ్వకండి..

కొత్త కార్డుల కోసం ఎవరూ మధ్యవర్తులకు డబ్బులు చెల్లించవద్దని బుష్రా సుల్తానా స్పష్టం చేశారు. ప్రభుత్వం నేరుగా విచారణలు చేస్తుందని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ బియ్యం విక్రయించడం నేరం..

ప్రభుత్వం సరఫరా చేస్తున్న ‘సన్న బియ్యం’ను అమ్మడం నేరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఈ రకమైన నేరాలకు పాల్పడినట్లు తేలితే, వారి రేషన్ కార్డు రద్దు చేస్తామని, అలాగే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు.