365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్ట్ 1,2024 :రైతుబడి డిజిటల్ మీడియా సంస్థ.. “రైతుబడి అగ్రి షో”పేరుతో రైతులకు చేరువలో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శనలు చేపడుతోంది.
2024 ఆగస్టు 17, 18 తేదీల్లో నల్గొండలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్ లో Agriculture Exhibition నిర్వహించనుంది. తర్వాత అన్ని జిల్లాల్లో వరుసగా జరుగుతాయి.
25 లక్షల మందికి పైగా ఫాలోవర్లతో అతి పెద్ద వ్యవసాయ డిజిటల్ మీడియా సంస్థగా ఉన్న రైతుబడి యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, వాట్సాప్, వెబ్ సైట్లతోపాటు.. గ్రామాల్లోనూ పత్రికలు, టీవీలు, ఫ్లెక్సీ బోర్డులు, పోస్టర్లు, బ్రోచర్లు, ఆటోలు, దండోరా ప్రకటనల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టనుంది.
నల్గొండలో జరిగే ఎగ్జిబిషన్ కు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల వ్యాప్తంగా.. 50 వేల మంది ఔత్సాహిక రైతులకు ఎంట్రీ పాస్ లు అందిస్తుంది.
ఈ వ్యవసాయ ప్రదర్శనలో 150కి పైగా దేశ, విదేశీ కంపెనీలు పాల్గొంటాయి. అత్యాధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు (హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, జేసీబీలు, పవర్ వీడర్, పవర్ టిల్లర్, మోటార్, ఆటోమేటిక్ స్టార్టర్, వ్యవసాయ రోబో, సోలార్ వాహనాలు, స్ప్రేయర్లు, డ్రోన్ స్ప్రేయర్, ట్రాక్టర్ ఇంప్లిమెంట్, డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్, షేడ్ నెట్, స్పేర్ పార్ట్స్, టూల్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరికరాలు, అగ్రి యాప్ లు) ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్, విత్తనాలు, నర్సరీ కంపెనీలు పాల్గొంటాయి. వర్మీ కంపోస్ట్, జీవామృతం, వేప నూనె, ఆముదం పిండి వంటివి సైతం లభిస్తాయి.
పౌల్ట్రీ, డెయిరీ, ఆక్వా రంగాలకు చెందిన కంపెనీలు, వ్యవసాయ రుణాలు ఇచ్చే బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు సైతం పాల్గొంటాయి. మరిన్ని వివరాలు www.rbagrishow.com వెబ్ సైట్లో తెలుసుకోవచ్చు.