365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,డిసెంబర్ 23,2025: భారత పునరుత్పాదక ఇంధన రంగంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సోలార్ సంస్థ ‘ట్రూజన్ సోలార్’ (సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్) తో క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారు. ఈ సంస్థలో ఆయన భారీగా పెట్టుబడులు పెట్టడమే కాకుండా, దీర్ఘకాలిక భాగస్వామిగా వ్యవహరించనున్నారు.
2030 నాటికి అగ్రస్థానమే లక్ష్యం
ఈ భాగస్వామ్యం ద్వారా 2030 నాటికి భారతదేశంలోని టాప్-3 సోలార్ EPC (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) కంపెనీలలో ఒకటిగా ఎదగాలని ట్రూజన్ సోలార్ లక్ష్యంగా పెట్టుకుంది. సచిన్ టెండూల్కర్ వంటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న వ్యక్తి తోడవడంతో, బ్రాండ్ విలువ పెరగడమే కాకుండా దేశవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుందని సంస్థ భావిస్తోంది.

జాతీయ స్థాయికి విస్తరణ
ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బలంగా ఉన్న ట్రూజన్ సోలార్, ఇప్పుడు సచిన్ పెట్టుబడులతో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించనుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా వంటి అధిక డిమాండ్ ఉన్న మార్కెట్లలోకి దూకుడుగా వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
సచిన్ రాకతో కొత్త ఉత్తేజం
ఈ సందర్భంగా సంస్థ ఎండీ చరుగుండ్ల భవాని సురేష్ మాట్లాడుతూ.. “సచిన్ గారితో ఈ అనుబంధం కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, మా సంస్థపై ఆయనకు ఉన్న నమ్మకానికి నిదర్శనం. ప్రతి ఇంటికి, పరిశ్రమకు సౌర విద్యుత్తును చేరువ చేయడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.
ట్రూజన్ సోలార్ సేవలు:
గృహ అవసరాలు: ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్.
పరిశ్రమలు: కమర్షియల్,ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు.
వ్యవసాయం: కేంద్ర ప్రభుత్వ ‘PM-KUSUM’ పథకం కింద రైతులకు సోలార్ సేవలు.

నిర్వహణ: సోలార్ ప్లాంట్ల దీర్ఘకాలిక నిర్వహణ,సేవలు (O&M).
భారతదేశాన్ని కాలుష్య రహిత దేశంగా మార్చాలన్న లక్ష్యంతో, గ్రామీణ,పట్టణ ప్రజలందరికీ తక్కువ ఖర్చుతో కూడిన సౌర విద్యుత్తును అందించడంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించనుంది.
