Sat. Sep 7th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 3,2024: భారతదేశంలోని ప్రముఖ బీమా సంస్థ టాటా ఏఐజీ, వర్షాకాలంలో వాహన రక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ పథకాలను అందిస్తోంది.

వర్షాకాలంలో, ముఖ్యంగా వరదల బారిన పడే ప్రాంతాల్లో వాహనాలపై నీటి కారణంగా కలిగే నష్టాలు పెరిగే అవకాశముంది. అయితే, టాటా ఏఐజీ అందించే వాహన బీమా పాలసీలు, వాహనదారులకు విస్తృత కవరేజీతో పాటు ఈ సీజనల్ సవాళ్లను సమర్థవంతంగా అధిగమించడానికి కావాల్సిన సర్వీసులు అందిస్తాయి.

వర్షాకాలానికి సంబంధించిన రిస్కుల నుండి సమగ్ర రక్షణ:

  • ఇంజిన్ సెక్యూర్: వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల నీరు చొరబడటం కారణంగా మీ కారు ఇంజిన్ నష్టపోతే రక్షణ కల్పిస్తుంది.
  • గ్లాస్, ఫైబర్, ప్లాస్టిక్, రబ్బర్ భాగాల మరమ్మత్తు: చిన్న చిన్న డ్యామేజీలు మార్పులు చేయకుండా మరమ్మత్తు చేయడం ద్వారా మీ నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సీబీ)ను కాపాడుకోవచ్చు.
  • డిప్రిసియేషన్ రీయింబర్స్‌మెంట్ కవర్: భాగాల డిప్రిసియేషన్ లేకుండా పూర్తి కవరేజీ అందించడం ద్వారా నష్టాలు తగ్గించి, సమగ్ర రక్షణను పొందవచ్చు.
  • ఎలక్ట్రిక్ సర్జ్ సెక్యూర్: నీటి ప్రవేశం కారణంగా షార్ట్ సర్క్యూట్, ఆర్కింగ్, విద్యుత్ లీకేజ్ వంటి సమస్యల వల్ల తలెత్తే నష్టాలకు కవరేజీ అందిస్తుంది.
  • ఎన్‌సీబీ ప్రొటెక్షన్ కవర్: ఎన్‌సీబీ ప్రభావం పడకుండా క్లెయిమ్ చేసేందుకు అనుమతిస్తుంది, తద్వారా ప్రీమియం రిన్యువల్ సమయంలో 50% వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
  • టోయింగ్ ,ఆన్-రోడ్ రిపేర్: కారు ఆగిపోతే ఉచిత టోయింగ్, రిపేర్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రోడ్ సైడ్ అసిస్టెన్స్ (ఆర్ఎస్ఏ) కవర్ వల్ల సహాయం ఒక కాల్‌తోనే అందుబాటులో ఉంటుంది.
  • విస్తృత గ్యారేజీల నెట్‌వర్క్: వివిధ ప్రాంతాల్లో 10,000+ గ్యారేజీలలో రిపేర్ సర్వీసులు పొందవచ్చు, తద్వారా డౌన్‌టైమ్ తగ్గుతుంది.
  • 99% క్లెయిమ్ సెటిల్మెంట్ రేటు: విశ్వసనీయమైన క్లెయిమ్ ప్రాసెసింగ్ వలన అత్యంత వేగంగా పునరుద్ధరించబడుతుంది.
  • సులభతర పాలసీ జారీ: కేవలం మూడు దశల్లోనే పాలసీ జారీ చేయడం వలన ఈ ప్రక్రియ సులభతరంగా ఉంటుంది.
  • 24×7 సహాయం: ఎలాంటి సందేహాలు లేదా ఎమర్జెన్సీలు ఉన్నా, రౌండ్ ద క్లాక్ సహాయం అందుబాటులో ఉంటుంది, అసమానమైన కస్టమర్ సర్వీసులను అందిస్తుంది.

టాటా ఏఐజీ, మోటార్ ఇన్సూరెన్స్, ఆటో & యాక్చువేరియల్ అనలిటిక్స్ సీనియర్ ఈవీపీ & హెడ్ నీల్ ఛేడా మాట్లాడుతూ, “మా కస్టమర్లు ఈ వర్షాకాలం సీజన్‌లో విశ్వాసంతో ముందుకు సాగేందుకు కావాల్సిన రక్షణను అందించడం కోసం, టాటా ఏఐజీ ప్రత్యేకంగా రూపొందించిన ఈ బీమా పథకాలు చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి” అన్నారు.

టాటా ఏఐజీ ఇప్పటివరకు ఐదు కోట్లకు పైగా కస్టమర్లకు సేవలు అందించింది, గత ఏడాది ఒక్కటే ఒక కోటి పైగా పాలసీలను జారీ చేసింది. వాహన బీమా పరిశ్రమలో టాటా ఏఐజీ అగ్రగామి సంస్థగా నిలిచింది.

మరింత సమాచారం కోసం దయచేసి www.tataaig.com లో లాగిన్ అవ్వండి.

error: Content is protected !!