365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,జూలై 15,2024: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సాయి లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ తమ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ని (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసింది. దీని ప్రకారం రూ. 1 ముఖవిలువ చేసే షేర్ల విక్రయం ద్వారా కంపెనీ నిధులు సమీకరించనుంది. ఆఫర్‌లో భాగంగా రూ. 800 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, సెల్లింగ్ షేర్‌హోల్డర్లు 6,15,73,120 షేర్లను విక్రయించనున్నారు.
తాజాగా జారీ చేసిన షేర్ల ద్వారా సమీకరించే నిధుల్లో కొంత మొత్తాన్ని రూ. 600 కోట్ల రుణాల చెల్లింపునకు (పూర్తిగా లేదా పాక్షికంగా), మిగతా మొత్తాన్ని కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది.
అంతర్జాతీయ ఫార్మా ఇన్నోవేటర్ కంపెనీలు, బయోటెక్నాలజీ సంస్థలకు స్మాల్ మాలిక్యూల్ న్యూ కెమికల్ ఎంటిటీస్ (ఎన్‌సీఈ)కి సంబంధించిన డ్రగ్ డిస్కవరీ, డెవలప్‌మెంట్, తయారీ తదితర సేవలను సాయి లైఫ్ సైన్సెస్ అందిస్తోంది. కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, జెఫ్రీస్ ఇండియా, మోర్గాన్ స్టాన్లీ ఇండియా సంస్థలు ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.