Sairam Quiz competitions,

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఖమ్మం,డిసెంబర్ 25,2022: ఖానాపురం హవేలి శ్రీ విజయనగర్ కాలనీ షిరిడి సాయి బాబా మందిరం ప్రాంగణంలో సాయిరాం క్విజ్ పోటీలను మందిరం చైర్మన్ ఫణిభట్ల రాజలింగయ్య సిద్ధాంతి ఆధ్వర్యంలో నిర్వహించారు.

18 సం॥ల లోపు బాలబాలికలు,ఆ పై సంవత్సరాలు వాళ్లు పాల్గొని విజయవంతం చేశారు .

న్యాయ నిర్ణయతలుగా కౌలూరి అప్పారావు, రాయల నారాయణ , నందుల పరశురాం, కొమ్మురాజు శ్రీనివాసరావు, జై శ్రీనివాసులు వ్యవహరించారు .

Sairam Quiz competitions,

ఈ పోటీలకు సుమారు100 మంది పాల్గొన్నారు. గెలుపొందిన వారికి ప్రధమ,ద్వితీయ,తృతీయ బహుమతులు అందించారు.

మిగతా వారికి వారికి సాయిబాబా ఫోటోను జ్ఞాపకంగా అందజేశారు . ఈ కార్యక్రమంలో బహుమతి ప్రదాతగా కృషి ఫోటో స్టూడియో అధినేత చావా సంపత్ కుమార్ సహకరించారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సెక్రెటరీ పెంట్యాల వెంకట నరసయ్య, జాయింట్ సెక్రెటరీ చండ్ర వీరభద్రరావు, కోశాధికారి కౌలూరి అప్పారావు సభ్యులు మండెపూడి కృష్ణయ్య, భూక్య బిక్షపతి, దేవాలయ పూజారి బొడ్డుపల్లి కాశి విశ్వనాథ్ శర్మ తదితరులు పాల్గొన్నారు .