365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 30, 2022:
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాల) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో తెలిసిందేనన్నారు. ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలవుతున్నాయన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాన్ని వక్రీకరించారని సజ్జల రామకృష్ణ ఆరోపించారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మాత్రమే సీఎం జగన్ సూచించారని సజ్జల పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికీ లేదని సజ్జల అన్నారు. విద్యుత్ సంస్కరణలు, ఉద్యోగులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారో తెలియడం లేదన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై మాట్లాడితే బాగుంటుందని, ముందుగా హరీశ్ రావు వారి సమస్యలపై దృష్టి సారిస్తే బాగుంటుందని సజ్జల సూచించారు. విద్యుత్ సంస్కరణల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి తలొగ్గు తోందని గతంలో హరీశ్ రావు ఆరోపించారు.