365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ ,సెప్టెంబర్ 20,2021: సాల్ట్ థెరపీ, దీనిని హలోథెరపీ లేదా స్పెలియోథెరపీ అని కూడా పిలుస్తారు. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి . ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేని చికిత్సగా భావిస్తారు. ఈ ఉప్పు థెరపీ ఇప్పటిదేమీ కాదు. పురాతన కాలం నుంచి ఉపయోగిస్తూనే ఉన్నారు. జలుబు నుంచి చర్మ సంబంధిత సమస్యలకు సరైన పరిష్కారంగా చెబుతారు.
పోలాండ్ కు చెందిన వైద్యుడు బోస్కో విన్ స్కీ మొట్టమొదటిసారిగా 1843 లో ఉప్పు గుహాల ఆరోగ్య ప్రయోజనాలను గురించి పరిశోధనలు చేశాడు, పోలాండ్ లోని వెల్కిజ్ కా నగరంలోని ఉప్పు గనుల్లో అనేక ప్రయోగాలు చేసాడు. ఉప్పు థెరపీతో ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చో తన పరిశోధనల ద్వారా నిరూపించాడు. సహజసిద్ధమైన ఉప్పు రోగనిరోధకశక్తి పెంచడమే కాకుండా , శ్వాసకోశ సమస్యలను నయం చేయడానికి ఉపకరిస్తుందని బోస్కో విన్ స్కీ తేల్చాడు. ఉప్పు చికిత్స శాస్త్రీయపరంగా ఎలా పనిచేస్తుందనే విషయాల పై చాలా ఆధారాలను చూపించాడు.
వాటిని చుసిన విమర్శకులు సైతం బోస్కో విన్ స్కీ ని ప్రశంసించారు.మందుల అవసరాన్ని తగ్గిస్తూ ఉబ్బసం ఉన్న పిల్లలకు మంచి చికిత్సగా ఈ ఉప్పు థెరపీని యురోపీయన్లు భావిస్తున్నారు. ప్రత్యామ్నాయ చికిత్సల మాదిరిగా దీనిని ఉపయోగిస్తారు. ఉప్పు చికిత్స అనేది సహజమైన ఉప్పు గుహల్లో ఆరోగ్య సమయాన్ని గడిపే తూర్పు యూరోపియన్ ల సాంప్రదాయం.
అక్కడ సాంప్రదాయ వైద్యంగా భావిస్తూ నేటికీ విస్తృతంగా ఈ థెరపీని వినియోగిస్తున్నారు. భారత దేశంలో ఆయుర్వేదానికి ఎంతటి ఘనత ఉన్నదో అక్కడ కూడా ఉప్పు థెరపీకి అంతటి ప్రాధాన్యత ఉన్నది. సాల్ట్ థెరపీ సెంటర్లు అచ్ఛం బ్యూటీ పార్లర్ లను తలపిస్తుంటాయి. ఆధునిక ఉప్పు గదులు సహజ ఉప్పు గనులను ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా చిన్నారుల్లో వచ్చే శ్వాసకోశ సమస్యలను నయం చేయడానికి పురాతన కాలం నుంచి ఇదే విధానాన్ని అనేక దేశాల్లో ఉపయోగిస్తున్నారు. ఉప్పు గదులు స్థిరమైన ఉష్ణోగ్రత ,తేమ కలిగి ఉంటాయి. లోపలి గోడలు స్వచ్ఛమైన ఉప్పుతో కప్పి ఉంటాయి, క్రిములు, కీటకాలు లోపలి ప్రవేశించడానికి అవకాశం ఉండదు.
ఉప్పు గుహల్లో విశ్రాంతి తీసుకునేటప్పుడు, 1 నుంచి 10 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉప్పు సూక్ష్మ కణాలు గదిలోకి విడుదలవుతాయి. శ్వాస, ముక్కు, గొంతు ,పిరితిత్తులలోకి ప్రవేశించి వైద్యం ప్రక్రియను ప్రారంభిస్తారు. 5 మైక్రోమీటర్ల కంటే పెద్ద కణాలు ముక్కు ,గొంతులోకి వెళతాయి. చిన్న కణాలుపిరితిత్తులోకి చొచ్చుకుపోతాయి. దీనివల్ల అలెర్జీలు, ఉబ్బసం, బ్రోన్కైటిస్, జలుబు , ఫ్లూ, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఎంఫిసెమా, రినిటిస్, ముక్కు సంబంధిత ఇన్ఫెక్షన్లు , సైనసిటిస్ వంటి సమస్యలకు చికిత్స చేయడానికి ఉప్పు గదులు ఎంతో బాగా ఉపయోగపడుతాయి. చెవి ఇన్ఫెక్షన్లు ,తామర, సోరియాసిస్ వంటి చర్మ రోగాలకు సాల్ట్ థెరపీ ప్రభావవంతంగా పనిచేస్తుంది.
అంగారక గ్రహంపై ఉప్పు నీటి సరస్సులుదాదాపు 300 కోట్ల సంవత్సరాల క్రితం అంగారక (మార్స్) గ్రహంపై ఉప్పు నీటి సరస్సులు ఉండేవని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ(అమెరికా) పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది. వాతావరణం లో పెరిగిన కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలేకాకుండా మానసిక రుగ్మతలు తలెత్తుతున్నాయి. దీంతో నిరాశ, ఆందోళన , ఒత్తిడి, వంటి సమస్యలు మొదలవుతున్నాయి.
ఉప్పు నీరు థెరపీ చేయడం వల్ల ఆధ్యాత్మికత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమం లో సాధన చేసే వారికి ఆధ్యాత్మిక బలం పెరిగి మానసిక ఒత్తిడి దూరమవుతుంది. ఒక బకెట్ లో మోకాళ్ళ వరకు నీరు నింపి అందులో రాళ్ల ఉప్పు అంటే కళ్ళు ఉప్పుని గుప్పెడు వెయ్యాలి. తరువాత రెండు కాళ్ళను బకెట్లో ఉంచి 12 నుంచి 14 నిమిషాల వరకు ‘శ్రీ కుల దేవతయై నమః’ అని నామ జపము చెయ్యాలి. ఇటీవలే షురూ అయింది సాల్ట్ గ్రీకు పదం హెలో. విదేశాల్లో మంచి ప్రాచుర్యంలో ఉన్న ఈ థెరపీ మన దేశానికి కూడా వచ్చింది. ముంబై, బెంగుళూర్ తర్వాత ఇటీవలే హైదరాబాద్ నగరంలోనూ సాల్ట్ రూమ్స్ ఏర్పాటు షురూ అయింది.
కాలుష్యభూతం నగరాల్ని వణికిస్తూ సృష్టిస్తున్న సమస్యల్లోశ్వాసకోశ వ్యాధులే ప్రధానమైనవి. దగ్గో, జలుబో, మరొకటో… సిటిజనుల శ్వాసకోశ సమస్యలు ఒకప్పుడు వృద్ధులు, చిన్నారులకే పరిమితమైనా ఇప్పుడు యువతలోనూ సాధారణమైపోయాయి. ప్రత్యామ్నాయ సాల్ట్ రూమ్ థెరపీ. శ్వాస కోస వ్యాధులతో పాటు మరిన్ని ఆరోగ్యలాభాలనూ ఇది అందిస్తుందంటున్నారు సాల్ట్ రూమ్ నిర్వాహకులు.ఎలా చేస్తారంటే …? హెలో జనరేటర్ మెషిన్ ద్వారా రూమ్‌లోకి సాల్ట్ ని స్ప్రెడ్ చేస్తారు. తద్వారా ఊపిరి పీల్చినప్పుడు సదరు ఉప్పు కణాలు లోపలికి ప్రవేశిస్తాయి.
ఆ గదిలో ఎటువంటి ప్రత్యేక పరిమళం ఉండదు. శరీరానికి చెమట పట్టదు. అయినప్పటికీ సాల్ట్ శరీరంలో ప్రవేశించిన తర్వాత కలిగే వ్యత్యాసం మనకు తెలుస్తుంది. ఇది మనం ఆహారంలో ఉపయోగించే సాల్ట్ లాంటిది కాదు కాబట్టి బీపీ ఉన్నప్పటికీ ఈ సాల్ట్ థెరపీకి అదేమీ అడ్డంకి కాదు. ప్రతి సెషన్ 55 నుంచి 60 నిమిషాల పాటు పూర్తయ్యాక స్నానం వంటివి ఏమీ చేయక్కర్లేదు. తిన్నగా మన పనులకు మనం వెళ్లిపోవచ్చు.
శ్వాసకోశ సమస్యలకు చెక్…సాల్ట్ రూమ్ థెరపీ పూర్తి సహజమైనదని, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఇది స్వస్థత చేకూరుస్తుందని నిపుణులు అంటున్నారు. స్వల్ప పరిమాణంలో గాలి నిరంతరం సరఫరా అవుతున్న గదిలో కూర్చున్న తర్వాత గాలిలో కలిసే ఉప్పు రేణువులు నాసిక ద్వారా లోపలికి వెళ్లిన అడ్డంకులను తొలగిస్తాయని బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయని వైద్యులు అంటున్నారు.
మ్యూకస్ సాధారణంగా ప్రయాణించేలా చేసి అస్తమా ను నియంత్రిస్తాయని చెబుతున్నారు. అస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్, సైనసైటిస్, అలర్జిక్, చర్మ వ్యాధులకు ఇది ఒక ప్రత్యామ్నాయచికిత్సగా పనిచేస్తుంది. ఫిట్‌నెస్ ఇంట్రెస్ట్ అధికంగా ఉన్నవాళ్లు హై ఇంటెన్సిటీ వర్కవుట్ చేసి అలసిపోయిన శరీరం మళ్లీ తిరిగి యథాతధ స్థితికి రావడానికి ఇది ఉపకరిస్తుంది.. మారథాన్ రన్నర్స్, క్రీడాకారులకు మాత్రమే కాకుండా సింగర్స్‌కి తమ గొంతు సమస్యల ను నివారిస్తుంది సాల్ట్ థెరపీ .