365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 3, 2025: ప్రముఖ మిఠాయి తయారీ సంస్థ సాంప్రే న్యూట్రిషన్స్ లిమిటెడ్ (BSE: 530617), నైజీరియాలోని తోలారామ్ వెల్నెస్ లిమిటెడ్‌తో తయారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. మూడు సంవత్సరాల పాటు అమలులో ఉండే ఈ ఒప్పందం కింద సాంప్రే, టోలారామ్ వెల్నెస్‌కు న్యూట్రాస్యూటికల్,ఆహార ఉత్పత్తులను అంగీకరించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసి సరఫరా చేస్తుంది.

ఈ ఒప్పందం ద్వారా ఏటా రూ.10 కోట్ల వ్యాపారం ఏర్పడుతుందని, మూడు సంవత్సరాల్లో మొత్తం సుమారు రూ.30 కోట్ల విలువ సాధిస్తుందని అంచనా. ఈ ఒప్పందం కంపెనీ ఆదాయాల పెరుగుదలకు, న్యూట్రాస్యూటికల్ ,ఆహార ఉత్పత్తుల విభాగంలో వ్యాపార విస్తరణకు దోహదం చేస్తుంది. చెల్లింపుల నిబంధనల ప్రకారం, 50% ముందస్తుగా, మిగతా మొత్తం డిస్పాచ్ సమయంలో చెల్లించబడుతుంది. రవాణా వ్యయాన్ని టోలారామ్ వెల్నెస్ భరిస్తుంది.

అదనంగా, కంపెనీ ఇటీవల ఆగస్టు 19, 2025న రామా ఎక్స్‌పోర్ట్స్‌తో కూడా మూడు సంవత్సరాల తయారీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.15 కోట్ల వరకు ఉండనుంది. ఈ ఒప్పందం కింద సాంప్రే ఉత్పత్తుల తయారీ, సరఫరా, ప్యాకేజింగ్, నాణ్యత హామీకి పూర్తి బాధ్యత వహిస్తుంది.

కంపెనీ యాజమాన్యం వ్యాఖ్యానిస్తూ,
“తోలారామ్ వెల్నెస్‌తో ఈ వ్యూహాత్మక ఒప్పందం మా వ్యాపార వృద్ధికి కీలక మలుపు. నాణ్యతను కేంద్రీకృతం చేసుకుని మేము విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తున్నాం. ఇటీవలి బలమైన ఆర్థిక ఫలితాలు, ప్రణాళికాబద్ధమైన నిధుల సేకరణ కార్యక్రమాలు, ఈ కొత్త ఒప్పందాలు కలిసి, మమ్మల్ని గ్లోబల్ కస్టమర్లకు మరింత విశ్వసనీయ భాగస్వాములుగా నిలబెడతాయి” అని తెలిపింది.

తాజా ఆర్థిక ఫలితాలు (Q1FY26):

కార్యకలాపాల నుంచి ఆదాయం: రూ.10.87 కోట్లు (Q1FY25లో రూ.4.51 కోట్లతో పోలిస్తే 141% వృద్ధి)

నికర లాభం: రూ.70.76 లక్షలు (Q1FY25లో రూ.9.89 లక్షలతో పోలిస్తే 615% వృద్ధి)

EPS: రూ.0.34 (Q1FY25లో రూ.0.11తో పోలిస్తే గణనీయమైన పెరుగుదల)

నిధుల సేకరణ ప్రణాళికలు:
ప్రిఫరెన్షియల్ ఇష్యూ, QIP (క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్), పబ్లిక్/ప్రైవేట్ ఆఫర్లు వంటి మార్గాల ద్వారా మూలధనం సమీకరించడానికి బోర్డు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. వాటాదారుల ఆమోదం కోసం బోర్డు సమావేశం ఏర్పాటు చేయనుంది.

నాణ్యత, కస్టమర్ సంతృప్తి, సామాజిక ప్రభావంలో ఉన్నత ప్రతిభకుగాను సాంప్రే న్యూట్రిషన్స్ లిమిటెడ్‌కు ఇండియా 5000 బెస్ట్ MSME అవార్డ్స్ 2024 కింద గుర్తింపు లభించింది.