samskruthi-high-school
samskruthi-high-school

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,జూన్ 30, 2022: “సంస్కృతి హై స్కూల్” విద్యార్థులు టెన్త్ ఫలితాల్లో సత్తాచాటారు. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోని సంస్కృతి హై స్కూల్ విద్యార్థులు ఘన విజయాన్ని సాధించారు. ఐదుగురు విద్యార్థినులు 10జీపీఏ మార్కులు సాధించారు. 54 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఐదుగురు విద్యార్థులు10 జి పి ఎ సాధించారు. కే,కావ్య హల్ టికెట్ నెంబర్ 2223153607, కే.సతీష్ నాయక్, 2223153345, యం.రీనా, 2223153897,డింపుల్ చౌదరి,2223153605, అంకిత జోషి 2223154033,10 జిపిఎ, జిపిఎస్ సాధించగా మిగతా విద్యార్థులలో జి గౌతమ్, అమీనా బేగం 9.8 ,మరో ఆరుగురు విద్యార్థులు 9.7 సాధించగా, మరో ముగ్గురు 9.5 మరో ఆరుగురు 9.3,నలుగురు 9.2 ఇద్దరు 9 మార్కులు సాధించగా మిగతా విద్యార్థులు కూడా మంచి గ్రేడ్లతో పాసయ్యారు.

samskruthi-high-school

ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మంగళారపు లక్మణ్ మాట్లాడుతూ “సంస్కృతి హై స్కూల్ ” క్వాలిఫైడ్ టీచింగ్ స్టాఫ్ ఉండడంతో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించగలిగారని అన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి, డైరెక్టర్ ఆకుల భవాని, రమేష్ విద్యార్థులను అభినందించి పుష్ప గుచ్చాలతో సత్కరించారు. వచ్చే విద్యాసంవత్సరం మరింత మంది విద్యార్థులు అత్యధికంగా గ్రేడ్స్ సాధించాలని ఆకాంక్షించారు.