Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా, మార్చి 9,2022 :శాంసంగ్‌ ఇండియా ఇప్పుడు తాము గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డును సృష్టించామని వెల్లడించేందుకు సంతోషిస్తుంది. ఈ రికార్డును 5 మార్చి 2022న సాధించింది. బహుళ ప్రాంతాలలో ఒకే సమయంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు అన్‌బాక్సింగ్‌ చేయడం ద్వారా గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ను సృష్టించింది. ఈ రికార్డులో భాగంగా మార్చి 5వ తేదీన 17 నగరాలలో 1820 మంది వినియోగదారులు శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 22 అలా్ట్రను అన్‌బాక్సింగ్‌ చేయడంతో ఈ రికార్డుసాధ్యమైంది.

ఈ కార్యక్రమంలో భాగంగా గెలాక్సీ ఎస్‌ 22 అలా్ట్రను ముందుగా బుక్‌ చేసుకున్న ఎంపిక చేసుకున్న వినియోగదారులకు శాంసంగ్‌,ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌ ఆవిష్కరణకు ముందుగానే డెలివరీ చేశారు.ఈ ప్రత్యేక వినియోగదారులకు లిమిటెడ్‌ ఎడిషన్‌ బాక్స్‌లను సైతం పొందే అవకాశం దక్కింది. దీనిలో గెలాక్సీ వాచ్‌ 4,గెలాక్సీ బడ్స్‌ 2 తో పాటుగా గెలాక్సీ ఎస్‌ 22 అలా్ట్ర సైతం ఉన్నాయి. ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ గెలాక్సీ ఎస్‌ 22 అలా్ట్ర బాక్స్‌లో ప్రత్యేకమైన థాంక్యూ నోట్‌ సైతం సీడ్‌ పేపర్‌లో ఉంది.తద్వారా సస్టెయినబల్‌ భవిష్యత్‌ పట్ల శాంసంగ్‌ ఇండియా నిబద్ధత వెల్లడైంది.

‘‘ఇది మాకు అతి గొప్ప రోజు. ఈ బృందంలో భాగమైనందుకు నేను చాలా సంతోషిస్తు న్నాను. ఈ బృందం 17 నగరాలలో ఈ రికార్డ్‌ బ్రేకింగ్‌ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించింది. మా వినియోగదారులు,ఈ చరిత్ర సృష్టించిన అభిమానులకు నేను ధన్యవాదములు తెలుపుతున్నాను. వీరంతా కూడా శాంసంగ్‌కు ఈ చారిత్రాత్మక దినం సృష్టించారు. ఎపిక్‌ అన్‌బాక్సింగ్‌తో మేము అధికారికంగా గిన్నీస్‌ వరల్డ్‌ రికార్ట్స్‌లో చేరాము. ఈ మహోన్నత విజయాన్ని మా అభిమానులతో కలిసి పంచుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము’’అని ఆదిత్య బబ్బర్‌, సీనియర్‌ డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌ ఆఫ్‌ ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌, శాంసంగ్‌ ఇండియా అన్నారు.

గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అధికారిక పర్యవేక్షకుడు స్వప్నిల్‌ దంగారికర్‌ మాట్లాడుతూ ‘‘ శాంసంగ్‌ ఇండియా ఎలకా్ట్రనిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ నూతన రికార్డును ‘బహుళ ప్రాంగణాలలో అత్యధిక సంఖ్యలో ప్రజలు అన్‌బాక్సింగ్‌ చేయడం’ ద్వారా సృష్టించిందని వెల్లడించడానికి సంతోషిస్తున్నాను. మొత్తంమ్మీద 1820 మంది విజయవంతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అత్యద్భుతమైన కార్యక్రమాన్ని 19 ప్రాంగణాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు తమ ఫోన్‌ను అందుకోవడంతో పాటుగా ఈ రికార్డులో భాగమయ్యారు. గతంలో ఎన్నడూ చేయని
రికార్డు ఫీట్‌ ఇది. శాంసంగ్‌ను అభినందిస్తున్నాను’’అని అన్నారు.

ఈ ఎపిక్‌ అన్‌బాక్సింగ్‌ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 17 నగరాలలో నిర్వహించారు. వీటిలో న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, చండీఘడ్‌, జైపూర్‌, లుథియానా, పాట్నా, ఇండోర్‌ వంటివి ఉన్నాయి.భారతదేశంలోని వినియోగదారులు తమ గెలాక్సీ ఎస్‌ 22 అలా్ట్ర, గెలాక్సీ ఎస్‌22+, గెలాక్సీ ఎస్‌ 22ను సుప్రసిద్ధ రిటైల్‌ ఔట్‌లెట్లు, శాంసంగ్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లు, శాంసంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌, అమెజాన్‌ డాట్‌ ఇన్‌ వద్ద మార్చి 10వ తేదీ వరకూ బుక్‌ చేసుకోవచ్చు. గెలాక్సీఎస్‌ 22 సిరీస్‌ మార్చి 11, 2022 నుంచి విక్రయాలకు అందుబాటులో ఉంది. గెలాక్సీఎస్‌ 22 అలా్ట్ర సాటిలేని శక్తిని నోట్‌ సిరీస్‌లో మిళితం చేయడంతో పాటుగా ప్రతిష్టాత్మక ఎస్‌ పెన్‌ను ప్రో గ్రేడ్‌ కెమెరాతో కలిగి ఉంటుంది.

ఎస్‌ సిరీస్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు నూతన ప్రమాణంగా నిలుస్తుంది. వినియోగదారులు గెలాక్సీ ఎస్‌ 22 అలా్ట్రను ముందుగా బుక్‌ చేసుకున్న ఎడల 26,999 రూపాయల గెలాక్సీ వాచ్‌4ను కేవలం 2999 రూపాయలకు పొందవచ్చు. అలాగే గెలాక్సీఎస్‌ 22+గెలాక్సీఎస్‌ 22ను ముందుగా బుక్‌ చేసుకున్న వినియోగదారు లు 11999 రూపాయల గెలాక్సీ బడ్స్‌ 2ను 999 రూపాయలకు పొందవచ్చు. అదనంగా గెలాక్సీ ఎస్‌,గెలాక్సీ నోట్‌ సిరీస్‌ వినియోగదారులు 8వేల రూపాయలను అప్‌గ్రేడ్‌ బోనస్‌గా పొందవచ్చు. అదే సమయంలో ఇతర ఉపకరణాల వినియోగదారులు 5వేల రూపాయలను అప్‌గ్రేడ్‌ బోనస్‌ గా పొందవచ్చు.ప్రత్యామ్నాయంగా, శాంసంగ్‌ ఫైనాన్స్‌ + ద్వారా ఈ ఉపకరణాలను కొనుగోలుచేసే వినియోగదారులు 5వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు.

error: Content is protected !!