365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,గురుగ్రామ్‌, మే 9,2025: దేశంలోనే అతిపెద్ద కస్టమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్‌ కొత్తగా గెలాక్సీ ఎఫ్56 5జి పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. తమ ఎఫ్ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన ఫోన్లలో ఇది అత్యంత సన్నని ఫోన్‌గా నిలిచింది.

కేవలం 7.2 ఎంఎం మందంతో వచ్చే ఈ ఫోన్‌… గోరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణతో ముందు-వెనుక భాగాల్లో కవర్ అయ్యింది. అంతేకాదు, ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6 అప్‌డేట్‌లకు మద్దతు, ఏఐ ఆధారిత ఫోటో ఎడిటింగ్ ఫీచర్లు దీన్ని ప్రత్యేకతగా నిలబెట్టాయి.

ఇది కూడా చదవండి…కెనరా రోబెకో మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్ విడుదల..

ఇది కూడా చదవండి…గ్లోబల్ స్కిల్ కౌన్సిల్‌ నుంచి కెఎల్‌ యూనివర్సిటీకి అరుదైన గుర్తింపు

సామ్‌సంగ్‌ ఇండియా ఎంఎక్స్ బిజినెస్ డైరెక్టర్ అక్షయ్ ఎస్ రావు మాట్లాడుతూ, ‘‘భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వినియోగదారులకు శక్తివంతమైన ఫోన్‌ను అందించాలన్న లక్ష్యంతో గెలాక్సీ ఎఫ్56 5జి రూపొందించాం. ఇది యువత కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన డివైస్’’ అని తెలిపారు.

పవర్‌ఫుల్ కెమెరా సెటప్‌
గెలాక్సీ ఎఫ్56 5జి 50 ఎంపీ ఓఐఎస్ ట్రిపుల్ కెమెరాతో వస్తోంది. తక్కువ వెలుతురు పరిస్థితుల్లోనూ నాణ్యమైన ఫోటోలు, వీడియోలు అందించేందుకు బిగ్ పిక్సెల్ టెక్నాలజీ, ఏఐ ఐఎస్పీ టెక్నాలజీ ఉన్నాయి.

12 ఎంపీ హెచ్‌డీఆర్ ఫ్రంట్ కెమెరా వలె సెల్ఫీలకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. 4కే వీడియో రికార్డింగ్, ఆబ్జెక్ట్ ఎరేజర్, సోషల్ మీడియాకు అనువైన ఎడిట్ సూచనలు వంటి ఏఐ ఆధారిత ఎడిటింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

డిజైన్, డిస్‌ప్లేలో ఆకర్షణ
ఈ ఫోన్‌ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ ఏఎమోలెడ్+ డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ హై బ్రైట్‌నెస్ మోడ్‌తో ప్రకాశవంతమైన కంటెంట్‌ను ఎక్కడైనా వీక్షించేలా చేస్తుంది. గ్లాస్ బ్యాక్‌తో మెటల్ కెమెరా డెకో కలసి ప్రీమియమ్ లుక్‌ను ఇస్తోంది. ఆకుపచ్చ, వైలెట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

ప్రాసెసింగ్, బ్యాటరీ పరంగా మెరుగైన పనితీరు
Exynos 1480 చిప్‌సెట్‌, LPDDR5X ర్యామ్‌ టెక్నాలజీతో ఈ ఫోన్ వేగవంతమైన పనితీరును అందిస్తుంది. 5000mAh బ్యాటరీతో దీర్ఘకాలం బ్రౌజింగ్, గేమింగ్‌, వీడియో వీక్షణకు అనువుగా ఉంటుంది. 45W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఉంది.

ఇది కూడా చదవండి…క్వాలిజీల్, నిర్మాన్ భాగస్వామ్యంతో డిజిటల్ యాక్సెస్ సీఎస్ఆర్ కార్యక్రమం

ఇది కూడా చదవండి…రాజేంద్రనగర్‌లో సరస్వతీ మాత విగ్రహావిష్కరణ..

గెలాక్సీ ఎక్స్‌పీరియెన్స్‌
ఈ ఫోన్‌ వన్ యుఐ 7తో వస్తోంది. 6 ఏళ్ల భద్రతా అప్‌డేట్‌లు, ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. సామ్‌సంగ్ నాక్స్ వాల్ట్ భద్రత, ట్యాప్ & పే వంటి కొత్త ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. గూగుల్ జెమిని ఇంటిగ్రేషన్‌తో వినియోగదారులకు కొత్త అనుభూతిని కలిగించేలా డిజైన్ చేశారు.

ధరలు, ఈఎంఐ వివరాలు
ఈ రోజు నుంచి రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభించనుంది. వినియోగదారులు నెలకు రూ.1556 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐ ఆఫర్లతో సామ్‌సంగ్ ఫైనాన్స్+, ఇతర ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా కొనుగోలు చేయవచ్చు.