365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్,ఇండియా,మర్చి 4,2022:భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నేడు గెలాక్సీ ఏ03ను విడుదల చేసినట్లు వెల్లడించింది. శాంసంగ్ ఏ సిరీస్‌కు తాజా జోడింపు గెలాక్సీ ఏ03. ఇది 6.5 అంగుళాల హెచ్‌డీ+డిస్‌ప్లేతో పాటుగా అసలైన 48 మెగా పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాతో షార్ప్ ఫోటోలను లైవ్ ఫోకస్‌తో ఒడిసిపడుతుంది.‘‘నూతన గెలాక్సీ ఏ03ను మార్కెట్‌లో వైవిధ్యతను తీసుకువచ్చే రీతిలో అసాధారణ ఫీచర్లతో తీర్చిదిద్దారు.
ఇది అత్యంత ఆకర్షణీయమైన ధర వద్ద లభిస్తుంది. ఈ ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్ అసలైన 48 మెగా పిక్సెల్ రియర్ కెమెరాతో రావడంతో పాటుగా ఈ విభాగంలో అత్యుత్తమమైన 6. అంగుళాల డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్,ఎక్కువ కాలం నిలిచి ఉండే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తుంది. గెలాక్సీ ఏ03ఇప్పుడు అన్వేషించడానికి
అమితాసక్తి ని ప్రదర్శించే మా వినియోగదారులకు పూర్తి స్థాయి ప్యాకేజీని అందిస్తుంది’’అని అక్షయ్ ఎస్ రావు,డిప్యూటీ జనరల్ మేనేజర్,మొబైల్,మార్కెటింగ్, శాంసంగ్ ఇండియా అన్నారు. అసలైన 48 మెగా పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా
గెలాక్సీ ఏ03 స్మార్ట్‌ఫోన్ అసలైన48 మెగా పిక్సెల్ రియర్ కెమెరాతో వస్తుంది.
ఇది మీరు మీ మధుర క్షణాలతో కూడిన అత్యున్నత శ్రేణి ఫోటోలు,వీడియోలను తీసెందుకు తోడ్పడుతుంది.దీనిలోని 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా మీరు షార్ట్ పోట్రెయిట్స్‌ను లైవ్ ఫోకస్‌తో అందించేందుకు తోడ్పడటంతో పాటుగా సహజసిద్ధ మైన బ్లర్ ఎఫెక్ట్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో పొందేందుకు సైతం వీలు కల్పిస్తుంది. గెలాక్సీ ఏ03లో 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా బ్యూటీ మోడ్‌తో ఉంది. ఇది మిమ్మల్ని సోషల్ మీడియాకు సిద్ధంగా ఒక్క క్లిక్‌లో మారుస్తుంది. గెలాక్సీ ఏ03లో స్మార్ట్ సెల్ఫీ యాంగిల్ ఫీచర్ ఉంది.
ఇది అసాధారణ గ్రూప్ సెల్ఫీలను ఆటోమేటిక్‌గా తీసుకునేందుకు స్మార్ట్ సెల్ఫీ యాంగిల్ ఫీచర్ కూడా ఉంది. దీనివల్ల ఒక ఫ్రేమ్‌లో ఎక్కువ ముఖాలు చూసినప్పు డు వైడ్ యాంగిల్‌కు ఆటోమేటిక్‌గా మారుతుంది.మృదువైన పనితీరు శక్తివంతమైన ఆక్టాకోర్ 1.6 గిగా హెర్జ్ ప్రాసెసర్ కలిగిన గెలాక్సీ ఏ03లో అత్యుత్తమ పనితీరు, మృదువైన మల్టీ టాస్కింగ్ ఉంది. గెలాక్సీ ఏ03లో 4జీబీ వరకూ ర్యామ్ ఉంది. ఇది వేగవంతమైన ఉత్పాదకత, బ్రౌజింగ్ లేదా బహుళ యాప్‌ల వినియోగ సమయంలో సైతం అతి తక్కువగా విద్యుత్ వినియోగం ఉంటాయి.
శక్తివంతమైన బ్యాటరీ సుదీర్ఘకాలం పాటు నిలిచి ఉండే రీతిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ గెలాక్సీ ఏ03లో ఉంది. ఇది ఎక్కువ కాలం నిలిచి ఉండేందుకు తగిన శక్తిని అందిస్తుంది. రోజంతా కూడా ఇది నిలిచి ఉండటంతో పాటుగా మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్కువ సమయం గడిపేందుకు, మీ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువగా చార్జింగ్ పెట్టేందుకు సైతం తోడ్పడుతుంది.శబ్దం,డిస్‌ప్లే గెలాక్సీ ఏ03లో అత్యద్భుతమైన 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. ఇది లీనమయ్యే వీక్షణ అనుభవాలను కంటెంట్‌ను అమితం గా ఆస్వాదించే వారికి అందిస్తుంది. గెలాక్సీ ఏ03తో మీరు సినిమాటిక్ వీక్షణ అనుభవాలను డాల్బీ అట్మాస్ మద్దతుతో వైర్డ్, బ్లూ టూత్ హెడ్ సెట్స్‌పై అందిస్తుంది.
అదే సమయంలో మీ అభిమాన షోస్,సినిమాలను కూడా వీక్షించవచ్చు. ఇతర ఫీచర్లు గెలాక్సీ ఏ03 ఇప్పుడు ఆండ్రాయిడ్ 11,ఒన్ యుఐ కోర్ 3.1కు మద్దతునంది స్తుంది. దీనివల్ల మీకు అత్యంత అవసరమైన అంశాల పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించేందుకు తొడ్పడుతుంది. అదే సమయంలో స్మార్ట్‌ఫోన్‌తో మీరు అతి సరళంగా, సమర్థవంతమైన విధానంలో ఇంటరాక్ట్ కావొచ్చు. గెలాక్సీ ఏ03 స్మార్ట్‌ఫోన్ 32జీబీ,64జీబీ అంతర్గత స్టోరేజీ,1టీబీ వరకూ విస్తరించుకోతగిన మెమరీతో వస్తుంది.
ధర,లభ్యత గెలాక్సీ ఏ03 మూడు ఆకర్షణీయమైన రంగులు– బ్లాక్ , రెడ్, బ్లూ లో 10,499 రూపాయల ధరలో 3జీబీ+32జీబీ వేరియంట్‌కు, 11,999 రూపాయల ధరలో 4జీబీ+64జీబీ వేరియంట్ లభ్యమవుతుంది. గెలాక్సీ ఏ03 ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ స్టోర్లు, శాంసంగ్ డాట్ కామ్,ఇతర సుప్రసిద్ధ ఆన్‌లైన్ పోర్టల్స్‌లో
లభ్యమవుతుంది.