Fri. Nov 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,ఏప్రిల్‌ 5, 2022: భారతదేశపు అత్యంత విశ్వసనీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ సాంసంగ్ గరిష్ట పనితీరు అందిస్తూ GenMZ ప్యాషన్ పాయింట్స్‌కు సపోర్టు చేసే ఆల్-రౌండర్ డివైస్‌ గెలాక్సీ M33 5Gని విడుదల చేస్తున్నట్లు నేడు ప్రకటించింది. 5nm ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ శక్తి, భారీ 6000mAh బ్యాటరీ, గొప్ప మైమరపింపజేసే 120Hz FHD+ డిస్‌ప్లే గెలాక్సీ M33 5G స్పోర్ట్స్ సొంతం.

“సాంసంగ్ ఫిలాసఫీకి అనుగుణంగా మేము ఆవిష్కరణల సరిహద్దులకు మరింత దూరానికి కొత్త గెలాక్సీ M33 5Gని తీసుకువెళుతున్నాము. ఇది మా యువ MZ వినియోగదారుల అనంతమైన అభిరుచులకు అనుగుణంగా నిలిచే శక్తివంతమైన అద్భుత డివైస్‌. మా వినియోగదారులు ఏమి చేయాలనుకున్నా గెలాక్సీ M33 5G ‘అన్నింటికీ సిద్ధంగా ఉంటుంది.’ 5nm ఎక్సీనాస్‌ ప్రాసెసర్, భారీ 6000mAh బ్యాటరీ వంటి సెగ్మెంట్-ఉత్తమ ఫీచర్లను ఇది కలిగి ఉంది.వాయిస్ ఫోకస్, పవర్ కూల్ టెక్నాలజీ, ఆబ్జెక్ట్ ఎరేజర్ వంటి ఉత్తేజకరమైన ఆవిష్కరణలు దీని ప్రత్యేకత. ఇది
యువతకు అపరిమితమైన అవకాశాలు కల్పిస్తుంది” అన్నారు సాంసంగ్‌ ఇండియా సీనియర్ డైరెక్టర్ మరియు ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆదిత్య బబ్బర్.

అసమానమైన పనితీరు కోసం

గెలాక్సీ M33 5G 5nm-ఆధారిత చిప్‌సెట్‌ 2.4GHz వరకు 8 కోర్లు కలిగి ఉంటుంది, ఇది దీన్ని వేగవంతమైన, సూపర్ పవర్-ఎఫిషియంట్‌గా చేస్తుంది. ఇది ర్యామ్ ప్లస్‌తో వస్తుంది, ఇది యూసేజ్‌ ప్యాటన్‌ను తెలివిగా అర్థం చేసుకుంటుంది. మల్టీ టాస్క్‌ సులభతరం చేసేందుకు మీకు 16GB వరకు వర్చువల్ RAMని అందిస్తుంది.

నిరంతరాయ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం

గెలాక్సీ M33 5G సెగ్మెంట్ బెస్ట్ 6000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది కాబట్టి అది రోజంతా హాయిగా పనిచేస్తుంది. సులభంగా పవర్‌ షేర్‌ చేసుకునేందుకు ఇది రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగి ఉంది. గెలాక్సీ M33 5G 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. తక్కువ సమయంలో మీకు ఎక్కువ శక్తిని ఇస్తుంది.

పర్ఫెక్ట్ మూమెంట్స్ కోసం సిద్ధం

గెలాక్సీ M33 5G అధిక-రిజల్యూషన్‌తో స్పష్టమైన ఫొటోలు క్యాప్చర్ చేసేందుకు 50MP ప్రధాన కెమెరా కలిగి ఉంది. 123 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూ, 5MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఫొటోగ్రాఫ్‌లకు కూడా ఇది పనిచేస్తుంది. 2MP మాక్రో లెన్స్ అద్భుతమైన డిటెయిల్స్‌తో క్లోజప్ షాట్స్‌ తీస్తుంది. డెప్త్ కెమెరా బ్యాక్‌గ్రౌండ్‌ని బ్లర్ చేసి బోకె ఎఫెక్ట్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ షాట్స్‌ తీసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. గెలాక్సీ M33 5Gలో సింగిల్ టేక్, ఆబ్జెక్ట్ ఎరేజర్, వీడియో TNR (టెంపోరల్ నాయిస్ రిడక్షన్) వంటి ఫీచర్లు ఉన్నాయి. గెలాక్సీ M33 5G 8MP ఫ్రంట్ కెమెరా అధిక స్పష్టత,ఆకర్షించే సెల్ఫీల కోసం AR ఫన్ మోడ్‌తో వస్తుంది.

సున్నితమైన అనుభూతి కోసం

గెలాక్సీ M33 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో అద్భుతమైన 6.6-అంగుళాల FHD+ డిస్‌ప్లే కలిగి ఉంది, ఇది మైమరపింపజేసే సూపర్ స్మూత్ వీక్షణ అనుభూతి అందించి రోజువారీ కంటెంట్‌ను షార్ప్‌ చేస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 మన్నికగా నిలవడటమే కాదు గీతలు పడకుండా రక్షణ కల్పిస్తుంది.

కూల్‌గా ఉంచుతుంది

గెలాక్సీ M33 5Gలోని పవర్ కూల్ టెక్ గంటల తరబడి ఉపయోగించినా కూడా హీటింగ్ సమస్యలు రాకుండా చూస్తుంది. ప్రధానంగా మొబైల్ గేమర్లు, భారీ వీడియో కాలర్స్‌ కోసం రూపొందించిన ఈ సాంకేతికత గెలాక్సీ M33 5Gలో అధిక వేడిని నిరోధించి ఫోన్ చల్లగా ఉండేలా చేస్తుంది.

స్పష్టమైన సంభాషణల కోసం సిద్ధం

గెలాక్సీ M33 5G వాయిస్ ఫోకస్ బిగ్గరగా వినిపించే బ్యాక్‌గ్రౌండ్ శబ్దాన్ని తగ్గించి రిసీవర్ వాయిస్‌ని మెరుగుపరుస్తుంది. దీని ద్వారా ప్రతి విషయమూ స్పష్టంగా వినగలుగుతారు. మీరు రద్దీ ప్రదేశంలో ఉన్నా లేదా సందడి వాతావరణంలో ఉన్నా కూడా మీ సంభాషణలు స్పష్టంగా ఉండేలా ఇది చూస్తుంది.

నిరంతరాయ కనెక్షన్స్‌ కోసం

మీరు మీ ప్రైమరీ సిమ్‌లో నెట్‌వర్క్‌ కోల్పోయినా ఆటోమేటిక్ డేటా స్విచింగ్ మీరు కనెక్ట్ అయి ఉండేందుకు సాయపడుతుంది. ఈ వినూత్న ఫీచర్‌తో మీరు మీ సెకండరీ SIM నెట్‌వర్క్‌ను సీమ్‌లెస్‌గా స్విచ్‌ అయి కాల్స్‌ లేదా డేటా కోసం మీ ప్రాథమిక సిమ్‌తో కనెక్ట్ అయి ఉండవచ్చు.

మెమరీ వేరియంట్లు, ధర, లభ్యత

గెలాక్సీ M33 5G 6GB+128GB ధర రూ.18999, 8GB+128GB వేరియంట్‌ ధర రూ. 20499. ప్రత్యేక ప్రారంభ ధరగా గెలాక్సీ M33 5G 6GB+128GB వేరియంట్‌ రూ. 17999, 8GB+128GB వేరియంట్‌ రూ.19499కు అందుబాటులో ఉంది. అంతే కాకుండా ICICI బ్యాంక్ కార్డ్ వినియోగదారులు INR 2000 తక్షణ క్యాష్‌బ్యాక్‌
పొందవచ్చు.గెలాక్సీ M33 5G ఏప్రిల్ 8, 2022 మధ్యాహ్నం 12 గంటల నుంచి Samsung.com, Amazon.in సహ ఎంపిక చేసిన రిటైల్ స్టోరులలో విక్రయించబడుతుంది.

error: Content is protected !!