365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,సెప్టెంబర్ 9,2025: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ ఓవెన్‌పై ఒక వినియోగదారుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓవెన్‌ను వంట చేయడానికి ఉపయోగించడం కుదరడం లేదని, ఇది కేవలం ఆహారాన్ని వేడి చేయడానికి మాత్రమే పనికొస్తుందని ఆయన ఆరోపించారు.
అనిశెట్టి చిరంజీవి అనే యూజర్ (@bobbychiru) తన ట్విట్టర్ (ఇప్పుడు X) ఖాతాలో ఈ అంశాన్ని లేవనెత్తారు. “కేస్ నెం. 299390411. ఈ సమస్య పరిష్కారం కాదని నాకు అర్థమైంది” అంటూ శాంసంగ్ ఇండియాను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు.
తన ఓవెన్‌ను “నిరుపయోగమైన వస్తువు”గా అభివర్ణించిన ఆయన, శాంసంగ్ ఆర్&డీ (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) విభాగానికి బెటర్ మెంట్ కోసం ఈ వస్తువును పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.

సాధారణంగా ఒక భారతీయుడు ఓవెన్ అంటే బేకింగ్ చేసుకోవచ్చని భావిస్తారని, కానీ శాంసంగ్ ఓవెన్‌తో ఆ అవకాశం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అందుకే, ఈ ప్రోడక్ట్ కు “ఓవెన్” అనే పేరు మార్చి “వార్మర్” అని పెట్టడం మంచిదని సలహా ఇచ్చారు. శాంసంగ్‌తో తనకు ఎదురైన అనుభవం చాలా చెత్తగా ఉందని కూడా ఆయన తన ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు.