365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ, డిసెంబర్ 20, 2025: పర్యావరణ సుస్థిరత కోసం సాంకేతికతను జోడించి అద్భుతాలు సృష్టించవచ్చని భారతీయ యువ విద్యార్థులు నిరూపించారు. ఐఐటి ఢిల్లీ (IIT Delhi) భాగస్వామ్యంతో నిర్వహించిన శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ విద్యా కార్యక్రమం ‘శామ్‌సంగ్ సాల్వ్ ఫర్ టుమారో (SFT) 2025’ ముగింపు వేడుకల్లో వినూత్న ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయి. వనరుల పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణే లక్ష్యంగా దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టారు.

విజేతగా ‘పృథ్వీ రక్షక్’.. వ్యర్థాల నుంచి సంపద సృష్టి!
ఈ ఏడాది పోటీలో ‘పృథ్వీ రక్షక్’ (Prithvi Rakshak) బృందం అగ్ర విజేతగా నిలిచింది. అభిషేక్ ధండా, ప్రభ్‌కిరత్ సింగ్ ,రచితా చందోక్ అభివృద్ధి చేసిన ఈ AI-ఆధారిత వర్మీకంపోస్టింగ్ వ్యవస్థ, స్మార్ట్ సెన్సార్ల సహాయంతో సేంద్రీయ వ్యర్థాలను అత్యంత నాణ్యమైన కంపోస్ట్‌గా మారుస్తుంది. పాఠశాలలు, మార్కెట్లు,నివాస సముదాయాలకు ఇది ఒక సమర్థవంతమైన వ్యర్థ నిర్వహణ పరిష్కారంగా నిలుస్తోంది.

పర్యావరణ సమస్యలపై పోరాడుతున్న ఇతర ఆవిష్కరణలు:
టాప్ ర్యాంకుల్లో నిలిచిన మరికొన్ని అద్భుతమైన ప్రాజెక్టులు:

డ్రాప్ ఆఫ్ హోప్ (ఉత్తరప్రదేశ్): సౌర శక్తిని ఉపయోగించి గాలిలోని తేమ నుండి స్వచ్ఛమైన నీటిని సేకరించే పరికరం.

పునరుత్పాదక డీశాలినేషన్ (అస్సాం): తక్కువ ఖర్చుతో ఉప్పు నీటిని తాగునీరుగా మార్చే వ్యవస్థ.

స్మాల్ బ్లూ (గుజరాత్): డేటా సెంటర్ల ద్వారా వెలువడే కార్బన్ ఉద్గారాలను తగ్గించే AI ప్లాట్‌ఫారమ్.

VOXMAPS (మధ్యప్రదేశ్): డ్రోన్ల ద్వారా కాలుష్య డేటాను సేకరించి వోక్సెల్ మ్యాప్‌లను రూపొందించే సాంకేతికత.

భారీ ప్రోత్సాహకాలు – కోటి రూపాయల వరకు మద్దతు
విజేతలకు ఐఐటి ఢిల్లీలో రూ. 1 కోటి వరకు ఇంక్యుబేషన్ మద్దతు లభించింది. అగ్రస్థానంలో నిలిచిన జట్లకు రూ. 1 లక్ష గ్రాంట్లు, యంగ్ ఇన్నోవేటర్ అవార్డులతో పాటు టాప్ 20 టీమ్ సభ్యులకు శామ్‌సంగ్ గ్యాలక్సీ Z ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌లను బహుకరించారు.

చిన్న పట్టణాల నుంచి చిగురిస్తున్న ఆశలు
ఈ 2025 ఎడిషన్‌లో టైర్-II ,టైర్-III నగరాల నుంచి భారీగా ఎంట్రీలు రావడం విశేషం. ఐఐటి ఢిల్లీలోని FITT ల్యాబ్‌ల ద్వారా విద్యార్థులు తమ ప్రోటోటైప్‌లను సిద్ధం చేసుకున్నారు. 2010 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా శామ్‌సంగ్ ప్రపంచవ్యాప్తంగా 68 దేశాలలో దాదాపు 29 లక్షల మంది యువతను STEM (Science, Technology, Engineering, Math) రంగాల్లో ప్రోత్సహిస్తోంది.