365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, గురుగ్రామ్, ఇండియా – నవంబర్ 2025:ఉచిత ప్రకటన–ఆధారిత స్ట్రీమింగ్ టెలివిజన్ (FAST) రంగంలో భారతదేశంలో ముందంజలో ఉన్న శామ్సంగ్ టీవీ ప్లస్, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంటెంట్ క్రియేటర్లతో ప్రత్యేక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, క్రియేటర్ల ప్రత్యేక FAST ఛానెల్స్‌ను భారతీయ ప్రేక్షకులకు హోమ్ స్క్రీన్‌పైనే అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఈ విస్తరణలో భాగంగా, మార్క్ రాబర్కు అంకితమైన తొలి FAST ఛానల్‌ను భారతదేశంలో ప్రత్యేకంగా ప్రారంభించారు. 71 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ఈ మాజీ నాసా ఇంజనీర్, ఆవిష్కర్త మరియు ప్రముఖ క్రియేటర్, ఇప్పుడు తన సైన్స్, సృజనాత్మకత, వినోదం కలయికను టీవీ ప్రేక్షకులకు అందించనున్నారు.
రాబర్ మాట్లాడుతూ,
“సైన్స్ అంటే ఆసక్తి మరియు సృజనాత్మకతకు కొత్త రూపమే. ఈ ఛానల్ ద్వారా ఆ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత మందికి చేరవేయడమే నా లక్ష్యం. నేర్చుకోవడం సరదాగా మారేలా చేసే ప్రయత్నం ఇది.” అన్నారు.
ఈ కొత్త క్రియేటర్ ఛానల్ కలెక్షన్లో మిచెల్ ఖరే యొక్క ‘చాలెంజ్ యాక్సెప్టెడ్’, ఎపిక్ గార్డెనింగ్ టీవీ, ది ట్రై గైస్, బ్రేవ్ వైల్డర్నెస్, ది సారీ గర్ల్స్ టీవీ వంటి ప్రముఖ గ్లోబల్ ఛానెల్స్ కూడా చేరాయి. ఇవి శామ్సంగ్ టీవీ ప్లస్ ప్రేక్షకులకు కొత్త తరపు కంటెంట్ అనుభవాన్ని అందించనున్నాయి.
ప్రస్తుతం శామ్సంగ్ టీవీ ప్లస్ 160కి పైగా ఛానెల్‌లను అందిస్తూ, దేశవ్యాప్తంగా 14 మిలియన్లకు పైగా శామ్సంగ్ స్మార్ట్ టీవీలలో అందుబాటులో ఉంది.

శామ్సంగ్ టీవీ ప్లస్ గ్లోబల్ హెడ్ మిస్టర్ సాలెక్ బ్రాడ్స్కీ మాట్లాడుతూ,
“మార్క్ రాబర్ సైన్స్‌ను వినోదంతో కలిపిన అరుదైన సృష్టికర్త. మా పెరుగుతున్న క్రియేటర్ల జాబితాలో ఆయన చేరడం మా కోసం గర్వకారణం. టీవీ వినోదాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్లేందుకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఈ ప్రీమియం కంటెంట్‌ను అందించడానికి మేము సంతోషంగా ఉన్నాం.” అన్నారు.
ఈ ప్రత్యేక కంటెంట్ ఒప్పందం, శామ్సంగ్ టీవీ ప్లస్ చేపట్టిన గ్లోబల్ విస్తరణలో కీలక మైలురాయిగా నిలుస్తోంది.
