365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,విశాఖపట్నం,సెప్టెంబర్ 17,2025: ప్రముఖ హెల్త్ కేర్ బ్రాండ్ కలర్స్ హెల్త్ కేర్ (Kolors Healthcare) తమ సరికొత్త శాఖను విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభించింది. రామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ అధునాతన ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ను ప్రముఖ నటి సంయుక్త మీనన్ రిబ్బన్ కట్ చేసి ఆవిష్కరించారు. అత్యాధునిక సౌకర్యాలను ఆమె పరిశీలించి, నిర్వహణ బృందాన్ని ప్రశంసించారు.

ఈ సందర్భంగా సంయుక్త మీనన్ మాట్లాడుతూ, “అందమైన విశాఖపట్నం నగర ప్రజలకు ఆరోగ్యం, అందంపై సేవలందించే ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ను ప్రారంభించడం నాకు గర్వంగా ఉంది. నేను నా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో, నేడు అందుబాటులో ఉన్న వెయిట్ లాస్ టెక్నాలజీ ఉండేది కాదు.

ఆరోగ్యవంతమైన శరీరం అంటే సరైన కండరాలను కలిగి ఉండటమేనని ఇప్పుడు నాకు అర్ధమైంది. ఇటీవల నేను మేఘాలయలో ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు, అక్కడి ప్రకృతిని బాగా ఆస్వాదించాను. నాకు ఎలాంటి శ్వాస సమస్యలు రాలేదు. కానీ, కొందరు వ్యక్తులు మాత్రం శ్వాస తీసుకోవడంలో, ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడటం గమనించాను.

ప్రపంచాన్ని అన్వేషించాలన్నా, ప్రకృతిని ఆస్వాదించాలన్నా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలి, అవసరమైన చికిత్సలు తీసుకోవాలి.

ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన సేవలను అందిస్తున్న కలర్స్ హెల్త్ కేర్‌కు నా అభినందనలు. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కలర్స్ హెల్త్ కేర్, ఇప్పుడు విశాఖపట్నం ప్రజలకు అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.

కలర్స్ హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ, “2004లో ప్రారంభమైన కలర్స్ హెల్త్ కేర్, ఇప్పటివరకు వేలాది మంది కస్టమర్లకు సంతృప్తికరమైన సేవలను అందించింది. నిరంతరం సరికొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ మా సేవలను మరింత బలోపేతం చేసుకుంటున్నాం.

మెడికల్ కండిషన్స్, ఇంజెక్షన్లు, హెల్త్ పౌడర్ వంటి సేవలతో మేము ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’గా అప్‌గ్రేడ్ అయ్యాం. మా దేశవ్యాప్త విస్తరణ ప్రణాళికలో భాగంగా, విశాఖపట్నంలో ఈ నూతన శాఖను ప్రారంభించడం మాకెంతో ఆనందంగా ఉంది” అని తెలిపారు.

Read This also…Heroine Samyuktha Menon Inaugurates Kolors Healthcare 2.O in Visakhapatnam

ఆపరేషన్స్ డైరెక్టర్ కృష్ణరాజ్ మాట్లాడుతూ, “గత 21 సంవత్సరాలుగా మా కస్టమర్ల నమ్మకం, సంతృప్తి మాకు మరింత విశ్వాసాన్ని అందించాయి. వారి డిమాండ్‌కు అనుగుణంగానే, మేము విశాఖపట్నంలో ఈ కొత్త బ్రాంచ్‌ను ఏర్పాటు చేశాం.

US-FDA ఆమోదం పొందిన టెక్నాలజీతో, మేము ఊబకాయం, జుట్టు, చర్మ సమస్యలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన చికిత్సలను అందిస్తున్నాం” అని వివరించారు.

మేనేజింగ్ డైరెక్టర్ డా. విజయ్ కృష్ణ మాట్లాడుతూ, “కలర్స్ హెల్త్ కేర్ సేవలను విశాఖపట్నం ప్రజలకు విస్తరించినందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. ఈ బ్రాంచ్‌ను ప్రారంభించడానికి విచ్చేసిన సంయుక్త మీనన్‌కు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆరోగ్యంగా, అందంగా ఉండాలనే ప్రతి ఒక్కరి ఆకాంక్షకు కలర్స్ హెల్త్ కేర్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది” అని అన్నారు.

5M మీడియా ఆధ్వర్యంలో జైదీప్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో, సంయుక్త మీనన్‌ను చూసేందుకు అభిమానులు, అతిథులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కలర్స్ హెల్త్ కేర్ నూతన శాఖ ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.