365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 6, 2023: ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా తన కెరీర్ కు గుడ్ బాయ్ చెప్పింది. తన వృత్తిపరమైన కెరీర్ నుంచి రిటైర్ అయ్యింది.
ఈ సందర్భంగా ఆమె హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్లో ఫేర్ వెల్ గ్రాండ్ రెడ్ కార్పెట్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సానియా మీర్జా తన సొంత ఊరిలో అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడా ప్రముఖుల మధ్య ఘనమైన వీడ్కోలు అందుకున్నారు.

ఈ సందర్భంగా ప్రముఖులు, ప్రముఖ క్రీడా కారులు, క్రికెటర్లు,నటి ,నటులు హాజరయ్యారు. ఎఆర్ రెహమాన్, మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్, సైనా నెహ్వాల్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, పి.కశ్యప్, హుమా ఖురేషి, అంగన్ బేడియా, నేహా ధూపియా, అనన్య బిర్లా, అంకిత రైనా తోపాటు పలువురు గ్రాండ్ రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు హాజరయ్యారు.