365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఫిబ్రవరి 6,2026: ఈ ఏడాది సంక్రాంతి విజేతగా నిలిచి, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన మెగాస్టార్ చిరంజీవి భారీ చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఇప్పుడు డిజిటల్ అలజడి సృష్టించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ వంటి పలు భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
Read this also:Chiranjeevi’s Sankranthi Blockbuster ‘Mana Shankara Vara Prasad Garu’ Sets Digital Premiere Date..
Read this also:ZF Launches Eco-Friendly TRW DTEC Brake Pads in India..
భారీ తారాగణం.. అద్భుతమైన కలయిక
దర్శకుడు అనీల్ రావిపూడి మార్క్ వినోదానికి, మెగాస్టార్ మ్యానరిజమ్స్ తోడై ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువ చేశాయి. ఈ సినిమాలో చిరంజీవి పవర్‌ఫుల్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నటించగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో మెరిశారు. నయనతార, క్యాథరిన్ ట్రెసా ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.
సినిమా ముఖ్యాంశాలు:
కథాంశం: తన కుటుంబానికి దూరమైన ఓ సెక్యూరిటీ ఆఫీసర్, తిరిగి వారిని ఎలా కాపాడుకున్నాడు? బాధ్యత, ప్రేమల మధ్య సాగే ఆయన ప్రయాణమే ఈ సినిమా.
వినోదం & యాక్షన్: అనీల్ రావిపూడి శైలి హాస్యం, చిరంజీవి మార్క్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
Read this also:ZF Debuts AI Diagnostics & Fleet Safety at Automechanika 2026..
Read this also:Samsung Certifies 2,000 Karnataka Youth in AI and Coding, Bolstering Local Tech Talent..
తొలి కలయిక: చిరంజీవి, వెంకటేష్‌లు కలిసి నటించడం మెగా,నందమూరి అభిమానులకు కనువిందు చేసింది.

సినిమా డిజిటల్ విడుదల గురించి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ, “థియేటర్లలో మాకు దక్కిన ప్రేమ అద్భుతం. ఇప్పుడు జీ5 ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ఇళ్లలోకి ఈ కథ చేరుతుండటం సంతోషంగా ఉంది” అని తెలిపారు.
వెంకటేష్ మాట్లాడుతూ, “చిరంజీవి గారితో నా తొలి జర్నీ చాలా స్పెషల్. భావోద్వేగాలు, హాస్యంతో సాగే ఈ ఫ్యామిలీ డ్రామాను ప్రతి కుటుంబం ఆస్వాదిస్తుందని నమ్ముతున్నాను” అన్నారు.
దర్శకుడు అనీల్ రావిపూడి మాట్లాడుతూ, థియేటర్ల రెస్పాన్స్ ఇచ్చిన ఉత్సాహంతో ఓటీటీలో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
