365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 3,2025: సంక్రాంతి కానుకగా గత నెల 14న థియేటర్లలో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం, కలెక్షన్లలో సునామీ సృష్టిస్తోంది. విడుదలై 20 రోజులు అయినా, ఈ చిత్రానికి కలెక్షన్లు స్టడీగా కొనసాగుతూనే ఉన్నాయి.
వీకెండ్స్‌లో థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ సినిమాలో వసూళ్ల పరంగా పలు రికార్డులు సృష్టించడంతో, సినిమాకు పెద్ద విజయమే తగిలింది.

ఇప్పటివరకు ఈ చిత్రానికి రూ. 303 కోట్లు వచ్చినట్లు, మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందని పోస్టర్‌లో పేర్కొన్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ అద్భుతమైన సంగీతం అందించారు. సినిమా ఆల్బమ్‌లోని దాదాపు అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. వెంకీమామతో పాటు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు.