Thu. Nov 7th, 2024
Saripalli Padmaja Reddy QUTHBULLAPUR people service

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్9, 2020 హైదరాబాద్: సేవే మార్గంగా ప్రజలకు అతి తక్కువ కాలంలో చేరువయ్యేవారు చాలా అరుదు… అటువంటి వారిని గురించి చెప్పుకోవాల్సి వస్తే సరిపల్లి పద్మజారెడ్డి గురించి తప్పకుండా ప్రస్తావించాల్సిందే… రాజకీయనాయకులు, అధికారులు, స్వచ్చంధ సంస్థల నిర్వాహకులు వీరంతా సమాజంలోని ప్రజలకు తమవంతుగా ఏదొక విధంగా సేవలు అందిస్తుంటారు. అయితే వాళ్ళు ఏదొక రూపంలో తాము చేసిన సేవలకు ప్రతిఫలం పొందుతుంటారు… కానీ కొందరు మాత్రం సేవే మార్గంగా.. తమ ఉదారతను చాటుకుంటూ ప్రజలకు దగ్గరవుతారు…సమాజసేవే లక్ష్యంగా బతుకుతుంటారు.. సరిగ్గా అదే కోవకు చెందుతారు సరిపల్లి పద్మజారెడ్డి. పరులకు ఉపకారం చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటారు ఆమె … ప్రచారానికి దూరంగా ప్రజలకు దగ్గరగా ఉంటారామే… సమాజానికి మేలు చేసేవాళ్లు… కనిపించాల్సిన పనిలేదు… కానీ తాను చేసే సేవ కనిపిస్తే చాలంటారు పద్మజారెడ్డి. సమాజం నుంచి తాను ఏమీ కోరుకోకపోయినా…. ప్రజలకు తనవంతు సాయంగా సేవలందిస్తానంటున్నారామే…హైదరాబాద్ నగరానికి చెందిన సరిపల్లి పద్మజారెడ్డి… కష్టాల్లో ఉన్న ప్రజలకు అడగక ముందే సాయమందిస్తూ వాడ వాడలోనూ… వీధి వీధిలోనూ… వేలాది మందికి తన వంతు సాయం అందిస్తున్నారామె.. ఎటువంటి లాభాన్ని ఆశించకుండా పలు సేవాకార్యక్రమాలు చేస్తున్నారు పద్మజారెడ్డి.

Saripalli Padmaja Reddy QUTHBULLAPUR people service
Saripalli Padmaja Reddy QUTHBULLAPUR people service

ఆపదలో అండగా….సరిపల్లి పద్మజారెడ్డి

హైదరాబాద్ నగరానికి చెందిన సరిపల్లి పద్మజారెడ్డి… కరోనా కష్టకాలం లోఆమె ఏమాత్రం భయపడలేదు.. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ప్రజల మధ్యనే తిరుగుతూ ఆపదలో వారికి అండగా నిలిచారు. మన హైదరాబాద్ లో వేలాది మంది ఆకలితీర్చడమే కాకుండా, ఆర్థిక సాయం చేస్తున్నారీ సామాన్య మహిళ. జనం “పద్మక్క “అంటూ పిలుచుకునే సరిపల్లి పద్మజా రెడ్డి ఎంతో కాలంగా బాలానగర్, కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఎవరికి ఏం కావాలన్నా తన స్థాయికి తగినట్లు సాయం అందిస్తున్నారు. “వ్యవసాయం కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆమెకు సామాన్య ప్రజలు పడే కష్టాలను చాలాబాగా అర్థం చేసుకోగలరు. అందుకోసమే తన వంతు సాయంగా ప్రజలకు ఇదొక విధంగా సాయపడాలనే సదుద్దేశంతో పరులకు ఉపకారం చేస్తున్నారు సరిపల్లి పద్మజారెడ్డి. పదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది విద్యార్థులు, సింగిల్ మదర్స్, దివ్యాంగులు, వయో వృద్ధులు, ఆనాధలు, మానసిక వికలాంగులకు సేవలందిస్తున్నది కోటి గ్రూప్ వారి సేవా ఫౌండేషన్. ఈ సంస్థకు పద్మజానారెడ్డి ట్రస్టీ గా ఉన్నారు.సేవా ఫౌండేషన్ సహకారంతోపాటు,కోటి గ్రూప్ కు చెందిన భారత్ హెల్త్ కేర్ లాబొరేటరీస్ ప్రై లిమిటెడ్ ల సంయుక్తాధ్వర్యంలో” బ్లడ్ డాట్ లైవ్” ను ప్రారంభించగా… దీని ద్వారా లక్షలాది మంది ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ఎంచుకున్నారు.

Saripalli Padmaja Reddy QUTHBULLAPUR people service
Saripalli Padmaja Reddy QUTHBULLAPUR people service
ఆపదలో అండగా….సరిపల్లి పద్మజారెడ్డి
ఆపదలో అండగా….సరిపల్లి పద్మజారెడ్డి

రక్తదాతలతో అనుసంధానం చేసి..ప్రాణదానం చేస్తూ…

ప్రాణాల కోసం పోరాడుతూ రక్తం అవసరం ఉన్నవారిని,వారి చుట్టు ప్రక్కల ఉన్న స్వచ్చంద రక్త దాతలతో అనుసంధానం చేసి రక్తదానాన్ని ప్రాణదానంగా మార్చడమే బ్లడ్ డాట్ లైవ్ ఉద్దేశ్యం. రక్తం పంచి ఇద్దరు పిల్లలను కన్న తల్లిగా ప్రాణం విలువేంటో తెలిసిన దానిగా, భారత దేశంలోనే కాదు… ప్రపంచ వ్యాప్తంగా నా తోటి అక్క చెల్లెమ్మలు కూడా ఎటువంటి సెక్యూరిటీ, ప్రైవసీ ఇబ్బందులు లేకుండా మన చుట్టూ ఉన్నవారి ప్రాణాలను కాపాడే విధంగా బ్లడ్ డాట్ లైవ్ రియల్ టైం లైఫ్ సేవింగ్ ప్లాట్ ఫామ్ తయారు చేశామని చెబుతున్నారు పద్మక్క.. కరోనా నేపథ్యంలో బాధితులకు సాయం అందించడానికి ప్లాస్మా డొనేషన్ చేసే వారి వివరాలను సేకరించి స్వచ్ఛంద సంస్థలకు అందించారు.

సేవే మార్గంగా ప్రజలకు దగ్గరైన…సరిపల్లి పద్మజారెడ్డి
సేవే మార్గంగా ప్రజలకు దగ్గరైన…సరిపల్లి పద్మజారెడ్డి
పద్మక్క అంటే… మహిళలకు ఒక భరోసా…
పద్మక్క అంటే… మహిళలకు ఒక భరోసా

పద్మక్క అంటే… మహిళలకు ఒక భరోసా…

మహిళల్లో పలు అంశాలపై అవగాహన కల్పించేవిధంగా పద్మజా రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఏదైనా సాధించాలంటే భరోసా కల్పించాలి… అందుకోసం మహిళాలోకానికి నేనున్నానంటూ చేయూతనందించింది. ఆడవాళ్లు అవకాశాలను అందిపుచ్చుకోవడమేకాదు.. అవసరమైతే.. అవకాశాలు సృష్టించాలంటూ మహిళాలోకాన్ని ముందుకు నడిపిస్తున్నారు సరిపల్లి పద్మజారెడ్డి. అంతేకాదు మహిళలంటే… వంటింటింటికి పరిమితమయ్యే ఇల్లాలుగా ఉండకూడదని చెబుతూ… సమాజంలో మహిళలు ఉన్నత శిఖరాలను అందుకోడానికి ఆడ, మగ అనే తారతమ్యం ఉండరాదంటారు సరిపల్లి పద్మజారెడ్డి.

error: Content is protected !!