365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,ఆగస్టు 11,2021:తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ముగింపు సందర్భంగా బుధవారం శాత్తుమొర జరిగింది.
ఇందులోభాగంగా ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా అలిపిరి పాదాల మండపం వద్దకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారికి నిర్వహించే ఊరేగింపును కోవిడ్-19 కారణంగా టిటిడి రద్దు చేసింది. ఈ కారణంగా సాయంత్రం ఆలయంలోనే విమానప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం శాత్తుమొర, ఉభయదారులు ఉభయం సమర్పించారు.