SBI General Insurance launches Fastlane Claim Settlement enabling quicker Motor Claim SettlementSBI General Insurance launches Fastlane Claim Settlement enabling quicker Motor Claim Settlement

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, ఫిబ్రవరి 17, 2025: దేశంలోని ప్రముఖ సాధారణ బీమా సంస్థల్లో ఒకటైన ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద ‘మేరీ పాలసీ మేరే హాథ్’ క్యాంపెయిన్‌లో భాగంగా కేంద్ర వ్యవసాయ,రైతు సంక్షేమ శాఖతో కలిసి పంట బీమా పాలసీ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

ఈ కార్యక్రమం 2025 ఫిబ్రవరి 1 నుంచి మార్చి 15 వరకు కొనసాగుతుంది. దీని ద్వారా రైతులకు వారి ఇంటి వద్దనే పంట బీమా పాలసీ పత్రాలను అందజేయడం, అలాగే వారిలో పంట బీమా ప్రయోజనాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఉంది.

SBI General Insurance Partners with Ministry of Agriculture for ‘Meri Policy Mere Haath’ Campaign – Rabi Season 2024-25

“మేరీ పాలసీ మేరే హాథ్” క్యాంపెయిన్‌కు ముఖ్య ఉద్దేశం పారదర్శకత పెంపొందించడం, రైతులకు పంట బీమా పథకాలు, క్లెయిమ్ ప్రక్రియలు,స్కీమ్‌ల ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడం.

ఈ క్యాంపెయిన్ ద్వారా రైతులు తమ పంట కవరేజీ, క్లెయిమ్‌లు,ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ గురించి సులభంగా తెలుసుకోగలుగుతారు. పీఎంఎఫ్‌బీవై స్కీమ్ కింద అందుబాటులో ఉండే సెంట్రల్ టోల్ ఫ్రీ నంబర్ 14447,నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్‌ను కూడా గుర్తింపజేయడం, అవగాహన పెంచడం దీని ముఖ్య లక్ష్యాలే.

SBI General Insurance launches Fastlane Claim Settlement enabling quicker Motor Claim Settlement
SBI General Insurance launches Fastlane Claim Settlement enabling quicker Motor Claim Settlement

ఈ క్యాంపెయిన్‌లో భాగంగా ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ 8 రాష్ట్రాల్లో అవగాహన వర్క్‌షాప్‌లు నిర్వహించనుంది. వీటిలో మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిషా, అస్సాం, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.

అలాగే, ఈ క్యాంపెయిన్ సోషల్ మీడియా ద్వారా కూడా రైతులను ఉత్సాహపర్చేందుకు #MeriPolicyMereHaath, #PMFBY, #FasalBimaKarao, #AtmanirbharKisan వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రచారం చేస్తుంది.

ఈ సందర్భంగా ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ,సీఈవో, నవీన్ చంద్ర ఝా మాట్లాడుతూ, “పీఎంఎఫ్‌బీయ్ కింద రైతులకు పంట బీమా ప్రయోజనాలను సులభతరం చేయడం, వారి ఆర్థిక భద్రత,నిశ్చింతను పెంపొందించడం మన లక్ష్యంగా ఉంది.

‘మేరీ పాలసీ మేరే హాథ్’ క్యాంపెయిన్ ద్వారా మనం రైతులకూ, స్థానిక అడ్మినిస్ట్రేషన్లకూ కలిసి పనిచేసి పాలసీ పంపిణీ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేందుకు కట్టుబడినప్పటికీ, మనం వారి మధ్య అవగాహన పెంచేందుకు,మంచి నమ్మకాన్ని కూర్చేందుకు ప్రయత్నిస్తాం” అన్నారు.