365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఇండియా,సెప్టెంబర్ 12,2024:భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటైన ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మిర్చి కలిసి 14వ ఎస్‌బీఐ లైఫ్ స్పెల్ బీ 2024 ఎడిషన్ ‘బీ స్పెల్‌బౌండ్’ను ఆవిష్కరించాయి.

స్పెల్‌బీ అనేక సంవత్సరాలుగా ప్రతిభావంతులైన భారత యువతను తీర్చిదిద్దే, వెలుగులోకి తెచ్చే వేదికగా నిలుస్తోంది. మరింత దార్శనికతతో, స్పెల్లింగ్ సామర్థ్యాల పరీక్షగా మాత్రమే మిగిలిపోకుండా అంతకు మించిన ప్రయోజనాలు చేకూర్చే లక్ష్యంతో ఈసారి మళ్లీ తిరిగొచ్చింది.

భవిష్యత్తులో గొప్ప నాయకులుగా ఎదిగేలా యువతకు సాధికారత కల్పించడం ద్వారా అభ్యాసం, సృజనాత్మకత,పురోగతి స్ఫూర్తిని వేడుకగా జరుపుకోవాలనేది దీని లక్ష్యం.

30 నగరాలు, 500+ పాఠశాలలవ్యాప్తంగా 14వ విడత కాంపిటీషన్ నిర్వహించబడుతుంది. ఇందులో 3 లక్షల మంది పైగా విద్యార్థులు పాల్గోనున్నారు. దేశవ్యాప్తంగా టాప్ 50 మంది విద్యార్థులు నేషనల్ ఫినాలేకి అర్హత పొందుతారు. అగ్రస్థానంలో నిల్చిన వారికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది; విజేతగా నిల్చినవారు ‘స్పెల్‌మాస్టర్ ఆఫ్ ఇండియా 2024’ కిరీటాన్ని దక్కించుకుంటారు.

ప్రతిష్టాత్మక గుర్తింపుతో పాటు విజేతకు రూ. 1 లక్ష గ్రాండ్ ప్రైజ్ మరియు హాంకాంగ్‌లోని డిస్నీల్యాండ్‌ను సందర్శంచే అవకాశం కూడా లభిస్తుంది.

ఈ ఏడాది థీమ్ అయిన “బీ స్పెల్‌బౌండ్!” అనేది క్యాచ్‌ఫ్రేజ్‌కి మించినదిగా ఉంటుంది; ఈ వేదిక లక్ష్యాన్ని మరింత ప్రస్ఫుటంగా తెలియజేసే విధంగా ఉంటుంది. బెస్ట్ స్పెల్లర్లను కనుగొనడమే స్పెల్ బీ 2024 ప్రధాన ఫోకస్ అయినప్పటికీ, భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దడానికి కూడా ఇప్పుడిది సమాన ప్రాధాన్యం ఇస్తుంది.

పదాలంటే అక్షరాల కూర్పు మాత్రమే కాదని సాధికారత సాధనాలని ఎస్‌బీఐ లైఫ్ విశ్వసిస్తుంది. అకడమిక్ సవాళ్లను అధిగమించేందుకు, అన్నింటికన్నా ముఖ్యంగా జీవితపు ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం పొందేలా విద్యార్థులకు సాధన సంపత్తిని సమకూర్చడం ఈ వేదిక లక్ష్యం.

“తమ పూర్తి సామర్ధ్యాల మేరకు రాణించడంలో వ్యక్తులకు సహాయకరంగా ఉండేలాఅవకాశాలను కల్పించడానికి ఎస్‌బీఐ లైఫ్ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. దేశవ్యాప్తంగా యువతకు ఈ విజన్‌ను చేరవేయడానికి స్పెల్ బీ భాగస్వామ్యం మాకు తోడ్పడుతోంది. గతేడాది సాధించిన అఖండ విజయంఈ వేదిక ,పరివర్తనాత్మక శక్తిపై మాకున్న నమ్మకాన్ని పునరుద్ఘాటించింది.

స్పెల్ మాస్టర్స్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం ద్వారా కేవలం అద్భుతమైన స్పెల్లర్లనే కాకుండా సమాజంపై అర్థవంతమైన ప్రభావం చూపే సామర్ధ్యమున్న భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దడంలో మేము తోడ్పాటు అందిస్తున్నాం” అని ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆఫ్ బ్రాండ్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్ అండ్ సీఎస్ఆర్) రవీంద్ర శర్మ తెలిపారు.

ఈ పోటీలో పాల్గొనే ప్రతీ ఒక్కరూ తమ మేథోసామర్ధ్యాలకు పదును పెట్టుకోవడంతో పాటు సాహసంసమగ్రత మరియు ఇన్నోవేషన్ వంటి విలువల గురించి మరింత లోతుగా తెలుసుకునే ప్రస్థానాన్ని ప్రారంభిస్తారు.

ఈ వేదిక ద్వారా మేము భారతదేశపు అత్యుత్తమ స్పెల్లర్లను గుర్తించడంతో పాటుకేవలం స్పెల్లింగ్‌కే పరిమితం కాకుండా పారదర్శకత, సాహసంవినయం సమగ్రతఇన్నోవేషన్,సస్టెయినబిలిటీ వంటి కీలక విలువలు మూర్తీభవించే భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దుతున్నాం.

ప్రతి విద్యార్థి జీవితంలో ఇవి నిర్మాణాత్మక విలువలుగా ఉంటాయి. తమ తోటి వారి విలువలను గౌరవిస్తూనే తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడంలో సహాయపడతాయి అని ఆయన చెప్పారు.

“అర్థవంతమైన, సమగ్రమైన ఎడ్యుటైన్‌మెంట్ ఆధారిత ప్రాపర్టీల ద్వారా పాఠశాలలకు చేరువ కావడానికి  మిర్చి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. స్పెల్ బీ మా ఫ్లాగ్‌షిప్ ప్రాపర్టీ. గత 13 సీజన్లుగా దీన్ని మరింతగా విస్తరించడం మాకు గర్వకారణమైన అంశం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు మరింత విలువల ఆధారిత అనుభవాన్ని అందించేందుకు మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. 

ఈసారి ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేసే కొత్త స్థాయి స్పెల్లర్స్‌ సామర్థ్యాలను ఈ ప్రాపర్టీ షోకేస్ చేస్తుంది. అంతేగాకుండా, స్పెల్లింగ్‌ను అందరికీ ఆహ్లాదకరమైన మరియు ఆసక్తికరమైనదిగా తీర్చిదిద్దేందుకు వివిధ మాధ్యమాలవ్యాప్తంగా ఆకర్షణీయమైన కంటెంట్‌ను క్రియేట్ చేయడంపై ఇది ప్రధానంగా దృష్టి పెడుతుంది.

తద్వారా కమ్యూనిటీని మరింతగా విస్తరించనుంది. భారతదేశవ్యాప్తంగా 500 పైచిలుకు పాఠశాలలు పాల్గొంటున్న సీజన్ 14, ఈ ప్రాపర్టీకి సంబంధించి ఒక అద్భుతమైన సీజన్‌ అవుతుంది” అని ఈవీపీ & నేషనల్ డైరెక్టర్ – IPs పూజా గులాటీ తెలిపారు.

పురోగతిగా ఉచ్చరించబడే స్పెల్ బీ పోటీ అనేది, యువతలో మేథోసంపత్తి, నాయకత్వం అలాగే జీవన నైపుణ్యాలను పెంపొందించడంలో ఎస్‌బీఐ లైఫ్‌కి గల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

మేథోసంపత్తి వృద్ధి, పదాలు అవి తెలియజేసే ఐడియాల శక్తిని వెలికితీసేందుకు ఈ పోటీ ఒక వేదికగా నిలుస్తుంది. ఎస్‌బీఐ లైఫ్ స్థిరమైన మద్దతు ద్వారా, కలలను సాకారం చేసుకునేందుకు తోడ్పాటు అందించడంలో,  ఆకాంక్షలను పెంపొందించడంలో సంస్థకు గల నిబద్ధతను, వన్ వర్డ్ ఎట్ ఏ టైమ్ అన్నట్లుగా, ఈ ప్రస్థానం ప్రతిఫలిస్తుంది.