Fri. Nov 22nd, 2024
Sbi-Mutual-Fund365telugu

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, ఫిబ్రవరి 20,2023: ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ స్కీమ్ అయిన ఎస్‌బీఐ డివిడెండ్ ఈల్డ్ ఫండ్‌ను ఆవిష్కరించినట్లు ఎస్‌బీఐ మ్యుచువల్ ఫండ్ ప్రకటించింది.

ఇది ప్రధానంగా డివిడెండ్ ఈల్డ్‌ ఇచ్చే కంపెనీల ఈక్విటీ అండ్ ఈక్విటీ ఆధారిత టూల్స్ తో చక్కని వైవిధ్యం ఉండే పోర్ట్‌ఫోలియోలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ 2023 ఫిబ్రవరి 20న ప్రారంభమై, 2023 మార్చి 6న ముగుస్తుంది. NIFTY 500 TRI ఈ ఫండ్‌కు ప్రథమ శ్రేణి బెంచ్‌మార్క్‌గా ఉంటుంది.

డివిడెండ్ ఈల్డ్‌ ఇచ్చే కంపెనీల ఈక్విటీ అండ్ ఈక్విటీ ఆధారిత సాధనాలతో కూడుకుని, సముచిత వైవిధ్యం గల పోర్ట్‌ఫోలియోలో ప్రధానంగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లకు పెట్టుబడి వృద్ధి , డివిడెండ్ రాబడుల అవకాశాలను అందించాలన్నది ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యం.

నిర్దిష్ట ధోరణి రంగానికి కట్టుబడకుండా ఆకర్షణీయమైన డివిడెండ్‌లతో పాటు డివిడెండ్‌ల వృద్ధికి అవకాశమున్న వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్ గల వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని, అలాగే నిఫ్టీ 50 సూచీతో పోలిస్తే కనీసం 50 శాతం పైగా సగటు డివిడెండ్ ఈల్డ్‌ను సాధించాలన్నది ప్రధాన ఉద్దేశం.

Sbi-Mutual-Fund365telugu

గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కనీసం ఒక్క ఏడాదైనా డివిడెండ్‌లు చెల్లించిన లేదా షేర్లను తిరిగి కొనుగోలు చేసిన స్టాక్స్‌ను ఈ స్కీమ్ పరిగణనలోకి తీసుకుంటుంది.

ఎస్‌బీఐ మ్యుచువల్ ఫండ్ ఎండీ అండ్ సీఈవో షంషేర్ సింగ్ మాట్లాడుతూ.. “ఎస్‌బీఐ డివిడెండ్ ఈల్డ్ ఫండ్‌ను ఆవిష్కరించడం సంతోషకరమైన అంశం. అధిక వృద్ధి చెందే డివిడెండ్ ఈల్డ్ కంపెనీల వైవిధ్యభరితమైన సమ్మేళనాన్ని ఇన్వెస్టర్లకు ఇది అందిస్తుంది.

దేశంలోనే అతి పెద్ద ఫండ్ హౌస్‌గా మేము మా ఉత్పత్తుల శ్రేణికి కొత్త వాటిని జోడించడం కొనసాగిస్తున్నాము. ఈ విభాగం మరింత వృద్ధి చెందడానికి అవకాశం ఉందని, ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో చోటు దక్కించుకోవడానికి అర్హమైనదిగా భావిస్తున్నాము” అని అన్నారు.

ఎస్‌బీఐ మ్యుచువల్ ఫండ్ డిప్యుటీ ఎండీ అండ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ డి. పి. సింగ్ మాట్లాడుతూ..“అధిక డివిడెండ్ ఈల్డ్ కంపెనీలంటే సాధారణంగా స్థిరమైన ఆదాయాన్నిచ్చే సాధనాలనే కోణంలోనే చూస్తుంటారు.

కానీ మార్కెట్ క్యాప్‌తో నిమిత్తం లేకుండా దీర్ఘకాలంలో సంపద సృష్టికి దోహదపడే సామర్థ్యాలు ఉన్న పలు వృద్ధి ఆధారిత స్టాక్స్ వాటిలో అనేకం ఉన్నాయి” అన్నారు.

దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులు అందించే అటువంటి పటిష్టమైన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టదలచుకునే వారికి ఎస్‌బీఐ డివిడెండ్ ఈల్డ్ ఫండ్ చక్కని అవకాశం కల్పిస్తుంది.

నేరుగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేవారికి, దీర్ఘకాలంలో సంపద సృష్టి కోరుకునే ఇన్వెస్టర్లకి, అలాగే తొలిసారి ఇన్వెస్ట్ చేస్తున్న మ్యుచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు కూడా ఈ ఫండ్ అనువైనదిగా ఉంటుంది.

Sbi-Mutual-Fund365telugu

స్థిరమైన ఆదాయం కోరుకునే ఇన్వెస్టర్లు, స్థిరంగా పన్ను ప్రయోజనంతో కూడుకునే రాబడి ప్రణాళికలను వేసుకునేందుకు ఈ ఫండ్ అందించే SWP (A)ని ఉపయోగించుకోవచ్చు” అని డి. పి. సింగ్ తెలిపారు.

పన్ను ప్రయోజనాలను పొందుతూ స్థిరంగా నగదు రాబడులు అందుకోవడానికి ఇన్వెస్టర్లు SWP (A) సదుపాయం కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు (స్కీమ్ సమాచార పత్రంలో పేర్కొన్న నియమ నిబంధనలకు లోబడి). ఈక్విటీ ఆధారిత మ్యుచువల్ ఫండ్‌లకు వర్తించే క్యాపిటల్ గెయిన్స్ దీనికి వర్తిస్తాయి.

తమ పెట్టుబడులపై సరళమైన పన్ను ఆదా చేసే విధంగా స్థిరమైన రాబడులు కోరుకునే ఎస్‌బీఐ మ్యుచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల కోసం అనుకూలీకరించిన SWP (A) సదుపాయం అందించబడుతోంది.

ఇన్వెస్టర్ చేయాల్సినదల్లా తమ పెట్టుబడి వ్యయంలో స్థిరంగా నిర్దిష్ట % లేదా తమ అవసరాలకు అనుగుణంగా ఇతరత్రా మొత్తాలను విత్‌డ్రా చేసుకోవడాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

ఇందుకోసం వివిధ ఆప్షన్లు (నెలవారీగా, త్రైమాసికాలవారీగా, అర్థ సంవత్సరవారీగా, వార్షికంగా) అందుబాటులో ఉన్నాయి. గ్రోత్ , ఐడీసీడబ్ల్యూ రెండింటిలోనూ SWP (A) సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. మిగతా నిధిపై యధాప్రకారం రాబడి వస్తుంటుంది.

కనీసం రూ. 5,000 అటుపైన రూ. 1 గుణిజాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. తన అసెట్స్‌లో 65% – 100% మొత్తాన్ని ఈ స్కీమ్ డివిడెండ్ ఇచ్చే కంపెనీల (ఈక్విటీ డెరివేటివ్స్ సహా) ఈక్విటీలు అండ్ ఈక్విటీ ఆధారిత సాధనాల్లోనూ, అలాగే 35 శాతం వరకూ మొత్తాన్ని ఇతరత్రా ఈక్విటీ అండ్ ఈక్విటీ ఆధారిత సాధనాలు, 35 శాతం వరకూ డెట్ సాధనాల్లో (సెక్యూరిటైజ్డ్ డెట్ అండ్ డెట్ డెరివేటివ్స్), అలాగే REITలు అండ్ InvITలు జారీ చేసే యూనిట్లలో 10 శాతం వరకూ ఈ స్కీమ్ ఇన్వెస్ట్ చేస్తుంది.

Sbi-Mutual-Fund365telugu

నిబంధనల ప్రకారం స్కీమ్ నెట్ అసెట్స్‌లో 35 శాతానికి మించకుండా ADR/GDR/విదేశీ ఈక్విటీలు, విదేశీ ఈటీఎఫ్‌లు, డెట్ సెక్యూరిటీలు వంటి విదేశీ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను కూడా స్కీమ్ పరిశీలిస్తుంది.

ఈ స్కీమ్‌కు రోహిత్ షింపి, సీఎఫ్ఏ ఫండ్ మేనేజర్‌గా ఉంటారు. అలాగే విదేశీ సెక్యూరిటీస్‌కు సంబంధించి ప్రత్యేక ఫండ్ మేనేజర్‌గా మోహిత్ ఉంటారు. రోహిత్ ప్రస్తుతం ఎస్‌బీఐ మ్యాగ్నమ్ ఈక్విటీ ఈఎస్‌జీ ఫండ్ అండ్ ఎస్‌బీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్‌లో ఈక్విటీ భాగాన్ని నిర్వహిస్తున్నారు.

error: Content is protected !!