365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 1,2023: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6వేలకుపైగా పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ జరగనుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, SBI అప్రెంటీస్ రిజిస్ట్రేషన్ విండో నేటి నుంచి అంటే సెప్టెంబర్ 1, 2023 నుంచి తెరవబడుతుంది.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 6 వేలకు పైగా పోస్టుల్లో రిక్రూట్‌మెంట్ జరగాల్సి ఉంది.


SBI అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2023 నేటి నుండి ప్రారంభమవుతుంది, దీనికి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 21. ఆసక్తి గల అభ్యర్థులు ఈ గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మొత్తం 6,160 పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రశ్నపత్రం 13 భాషల్లో ఉంటుంది..

వ్రాత పరీక్ష , స్థానిక భాషా పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా అర్హులైన అభ్యర్థులు ఈ నియామకానికి ఎంపిక చేయబడతారు. SBI అప్రెంటీస్ రాత పరీక్షలో 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు (1 గంట).

జనరల్ ఇంగ్లిష్ పరీక్ష మినహా అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ , హిందీ – 13 ప్రాంతీయ భాషల్లో ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన తేదీలు..

నోటిఫికేషన్ విడుదల: ఆగస్టు 31, 2023
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 1, 2023
దరఖాస్తు విండో చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2023
రాత పరీక్ష: అక్టోబర్, నవంబర్ 2023..

ఎలా దరఖాస్తు చేయాలి..?


SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ని సందర్శించండి.
హోమ్‌పేజీలో కెరీర్ సెక్షన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు కరెంట్ ఓపెనింగ్స్ పై క్లిక్ చేయండి.
SBI అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2023పై క్లిక్ చేయండి.
ఆన్‌లైన్ అప్లికేషన్‌కి వెళ్లండి.
అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, సమర్పించుపై క్లిక్ చేయండి.
తదుపరి సూచన కోసం నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌అవుట్ తీసుకోండి
.